Begin typing your search above and press return to search.

కొత్తగా మూడు.. మహారాజా మస్త్‌ బిజీ

విలక్షణ నటుడు విజయ్ సేతుపతి మహారాజా సినిమాతో కోలీవుడ్ మరియు టాలీవుడ్‌ లో హిట్‌ అందుకున్నాడు.

By:  Tupaki Desk   |   22 Jun 2024 5:17 AM GMT
కొత్తగా మూడు.. మహారాజా మస్త్‌ బిజీ
X

విలక్షణ నటుడు విజయ్ సేతుపతి మహారాజా సినిమాతో కోలీవుడ్ మరియు టాలీవుడ్‌ లో హిట్‌ అందుకున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ఏకంగా రూ.65 కోట్ల వసూళ్లు సాధించినట్లుగా సమాచారం అందుతోంది. లాంగ్ రన్‌ లో వంద కోట్ల క్లబ్‌ లో ఈ సినిమా చేరడం కన్ఫర్మ్‌ అన్నట్లుగా బాక్సాఫీస్ వర్గాల వారు అంటున్నారు.

ఆ మధ్య వరుసగా విలన్ వేషాలు వేసి, ఇతర హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో కనిపించిన విజయ్ సేతుపతి అభిమానుల డిమాండ్‌ మేరకు హీరోగా ఎక్కువ సినిమాలు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. విలన్ గా నటించాలి అంటే కొన్ని కండిషన్స్ అంటూ మెల్లగా ఆ పాత్రలకు దూరం అవుతున్నాడు.

మహారాజా హిట్ నేపథ్యంలో విజయ్ సేతుపతి మరింత బిజీ అయ్యాడు. ఇటీవలే కొత్త సినిమాకు సైన్ చేశాడు. ఇప్పటికే వెట్రిమారన్ దర్శకత్వంలో విడుతలై పార్ట్‌ 2 ను చేస్తున్న విషయం తెల్సిందే. దీపావళి కానుకగా ఆ సినిమా వచ్చే అవకాశం ఉంది.

ఇక సూర్య తో గతంలో ఈటీ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు పాండిరాజ్ దర్శకత్వంలో ఒక భారీ సినిమా రూపొందబోతుంది. అందుకు సంబంధించిన చర్చలు దాదాపుగా పూర్తి అయ్యాయట. గ్రామీన ఫ్యామిలీ బ్యాడ్‌ డ్రాప్ తో ఆ సినిమా ఉంటుందని తెలుస్తోంది.

మొత్తానికి విజయ్ సేతుపతి ఏమాత్రం గ్యాప్‌ ఇవ్వకుండా బ్యాక్ టు బ్యాక్‌ సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన ప్రతి సినిమాకు భారీ పారితోషికం తీసుకుంటున్నాడు. అయినా కూడా నిర్మాతలు ఆయనతో సినిమాలు చేసేందుకు క్యూ కడుతున్నారు. టాలీవుడ్‌ కి చెందిన పలువురు ప్రముఖ దర్శక నిర్మాతలు ఆయన్ను కంటిన్యూగా సంప్రదిస్తూ ఉన్నారట. విజయ్ సేతుపతి మాత్రం ఆచితూచి వ్యవహరిస్తూ కథలు ఎంపిక చేస్తున్నాడు.