Begin typing your search above and press return to search.

ఖాళీ దొరికితే హీరోకి అదే ప‌నా?

మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజ‌య్ సేతుప‌తి జ‌ర్నీ దేదీప్య‌మానంగా సాగిపోతున్న సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   14 Jun 2024 1:30 AM GMT
ఖాళీ దొరికితే హీరోకి అదే ప‌నా?
X

మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజ‌య్ సేతుప‌తి జ‌ర్నీ దేదీప్య‌మానంగా సాగిపోతున్న సంగ‌తి తెలిసిందే. హీరోగా సినిమాలు చేస్తునే స్టార్ హీరోల చిత్రాల్లో కీల‌క పాత్ర‌లు సైతం పోషిస్తూ ప‌రిపూర్ణి న‌టుడిగా కొన‌సాగు తున్నాడు. ఏడాదికి నాలుగైదు సినిమాలైనా రిలీజ్ అయ్యేలా చూసుకుంటున్నాడు. జూన్ 14న ` మ‌హారాజ` సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డానికి రెడీ అవుతున్నాడు. త‌మిళ్ తో పాటు తెలుగులోనూ రిలీజ్ అవుతుంది. ప్ర‌చారంలో భాగంగా అన్నీ మీడియా సంస్థ‌ల్ని చుట్టేస్తున్నాడు.

ఈనేప‌థ్యంలో తాజాగా విజ‌య్ ముందుకు ఓ ఇంట్రెస్టింగ్ క్వ‌శ్చ‌న్ వెళ్లింది. ద‌ర్శ‌క‌త్వ ప్ర‌య‌త్నాలు ఎంత‌వ‌ర‌కూ వ‌చ్చాయంటే? ఆస‌క్తిక‌ర స‌మాధానం ఇచ్చాడు. మంచి క‌థ‌ల‌కు కుదిరితే త‌ప్ప‌కుండా దర్శ‌కుడిగానూ ప‌నిచేస్తానన్నారు. `మూడు సినిమాల‌కు ఇప్ప‌టికే క‌థ‌, క‌థ‌నాన్ని కూడా సిద్దం చేసుకున్నాను` అని అన్నాడు. దీంతో మ‌క్క‌ల్ సెల్వ‌న్ మ‌రో పెద్ద ఐడియాతోనే ఉన్నాడ‌ని తెలుస్తోంది.

షూటింగ్ ఉంటే సెట్స్ కి హాజ‌ర‌వ్వ‌డం, ఖాళీగా ఉన్న స‌మ‌యంలో ఇలా క‌థ‌లు రాసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. అయితే కెప్టెన్ కుర్చీ ఎప్పుడు? అన్న‌ది మాత్రం స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేదు. న‌టుడిగా బిజీగా ఉన్నంత కాలం అదే మార్గంలో ప్ర‌యానిస్తాడ‌ని తెలుస్తోంది. అటుపై అవ‌కాశాలు త‌గ్గిన త‌ర్వాత కెప్టెన్ కుర్చి ఎక్కుతాడ‌ని తెలుస్తోంది. మ‌క్క‌ల్ సెల్వ‌న్ న‌టుడిగా ఏస్థాయి ఆద‌ర‌ణ పొందుతున్నాడో? చెప్పాల్సిన ప‌నిలేదు.

విశ్వ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్, సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ త‌ర్వాత ఆ స్థాయి న‌టుడు విజ‌య్ మాత్ర‌మేన‌ని కెరీర్ ప్రారంభించిన మూడు, నాలుగేళ్ల‌కే నిరూపించుకున్నాడు. త‌నలో విల‌క్ష‌ణ‌మైన న‌ట‌న‌తోనే సాధ్య‌మ‌ని ఎన్నో చిత్రాల‌తో నిరూపించాడు. హీరో మెటీరియ‌ల్ కాక‌పోయినా కేవ‌లం న‌ట‌న‌తోనే పాన్ ఇండియా వైడ్ విమ‌ర్శ‌కుల ప్ర‌శంసలందుకున్నాడు. అత‌డి క్రేజ్ తో త‌మిళ‌నాడులో కొత్త రాజ‌కీయ పార్టీ స్థాపించే అవ‌కాశాలున్న‌ట్లు కూడా వార్త‌లొచ్చాయి.