విజయ్ సేతుపతి 'మహారాజ'.. వాళ్లకు నచ్చలేదా?
లైంగిక వేధింపులను ముఖ్య అంశంగా తీసుకుంటే.. చాలా సున్నితంగా హ్యాండిల్ చేయాలని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
By: Tupaki Desk | 21 July 2024 5:33 PM GMTకోలీవుడ్ స్టార్ హీరో, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటించిన మహారాజ మూవీ.. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్న ఆ మూవీ.. కమర్షియల్ గా మంచి హిట్ అయింది. జూన్ 14వ తేదీన విడుదల అయిన ఆ సినిమా.. మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ దక్కించుకుని దూసుకుపోయింది. లాంగ్ రన్ లో రూ.110 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.
అయితే థియేటర్లో సూపర్ హిట్ అయిన మూవీ.. జూలై 12వ తేదీన నెట్ ఫ్లిక్స్ ఓటీటీలోకి వచ్చిన విషయం తెలిసిందే. స్ట్రీమింగ్ అయిన కొద్ది గంటలకే.. నేషనల్ వైడ్ గా టాప్ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఇప్పటికీ అలానే అదరగొడుతోంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషల్లో కూడా ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. మరిన్ని రోజులు సినిమా తన హవా కొనసాగించే అవకాశాలు ఉన్నాయనే చెప్పాలి.
థియేటర్స్ లో మిస్ అయిన వాళ్లు అంతా.. ఓటీటీల్లో చూసేస్తున్నారు. సినిమా అద్భుతంగా ఉందని, థ్రిల్లింగ్ గా అనిపించిందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు. ఎమోషనల్ గా ఉందని కూడా అంటున్నారు. బెస్ట్ మూవీస్ లో ఒకటిగా చెబుతున్నారు. ట్విస్ట్లు అదిరిపోయాయని కొనియాడుతున్నారు. అదే సమయంలో ఒక వర్గం ప్రేక్షకులు మాత్రం విమర్శిస్తున్నారు.
లైంగిక వేధింపులను ముఖ్య అంశంగా తీసుకుంటే.. చాలా సున్నితంగా హ్యాండిల్ చేయాలని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. హీరో స్ట్రెంత్ ను చూపించడానికి వయోలెన్స్ వాడితే సమస్య తీవ్రత మిస్ అవుతుందని చెబుతున్నారు. కొన్ని సన్నివేశాల బట్టి చూస్తుంటే.. లైంగిక హింసను చిత్రీకరించడం అతిగా, అనవసరంగా అనిపించిందని అంటున్నారు. గార్గి, చిత్తా వంటి చిత్రాలను ప్రస్తావిస్తున్నారు.
వాటిలో హింసను అతిగా కాకుండా.. గౌరవప్రదంగా చూపించారని చెబుతున్నారు. అయితే ఆ రెండు సినిమాల్లో సరైన పాయింట్లు లేవనెత్తినప్పటికీ కమర్షియల్ హిట్స్ అవ్వలేదు. కానీ ఒక వర్గం ప్రేక్షకుల నుంచి విమర్శలు ఎదుర్కొన్నా.. విజయ్ సేతుపతి కెరీర్ లో మాత్రం బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా మహారాజ నిలిచింది. మూవీలో సెలూన్ నడిపే మహారాజ పాత్ర పోషించిన ఆయన.. తన యాక్టింగ్ తో అదరగొట్టారు. ఎమోషన్ సీన్లలో మరోసారి తన మార్క్ చూపించారు.