Begin typing your search above and press return to search.

అతడి కోసం చాలా తక్కువకే ఒప్పుకున్నా...!

తమిళ నటుడు విజయ్‌ సేతుపతి విలక్షణ నటుడు అనడంలో ఎలాంటి సందేహం లేదు

By:  Tupaki Desk   |   11 Jun 2024 5:17 AM GMT
అతడి కోసం చాలా తక్కువకే ఒప్పుకున్నా...!
X

తమిళ నటుడు విజయ్‌ సేతుపతి విలక్షణ నటుడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎలాంటి పాత్రలు ఇచ్చినా, ఎలాంటి సినిమాలో అయినా ఆయన ఒదిగి పోయే తీరు నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. పాన్ ఇండియా స్థాయి స్టార్‌ నటుడిగా పేరు దక్కించుకున్న విజయ్ సేతుపతి తాజాగా మహారాజా అనే సినిమాలో నటించాడు.

ఈ వారంలో విడుదల అవ్వబోతున్న మహారాజా సినిమా ప్రమోషన్‌ లో భాగంగా మీడియా ముందుకు వచ్చిన విజయ్‌ సేతుపతి టాలీవుడ్‌ లో నటించిన ఉప్పెన సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆ పాత్రను తాను చేసిన సమయంలో చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారని పేర్కొన్నాడు.

ఇంకా విజయ్‌ సేతుపతి మాట్లాడుతూ... సాధారణంగా నాలాంటి నటులు హీరోలకు, హీరోయిన్స్ కి తండ్రి పాత్రలు చేసేందుకు ఒప్పుకోరు. కానీ నా వద్దకు వచ్చిన బుచ్చి బాబు చెప్పిన కథ నచ్చడంతో పాటు ఆయన రాసుకున్న డైలాగ్స్‌, ఇంకా స్క్రీన్‌ ప్లే అన్నీ కూడా బాగా నచ్చడంతో సినిమా చేసేందుకు ఒప్పుకున్నాను.

బుచ్చి బాబు కథ చెప్పిన విధానం నాకు బాగా నచ్చింది. అందుకే ఆయనతో వర్క్ చేసేందుకు ఆ సమయంలో ఓకే చెప్పాను. పైగా కొత్త దర్శకుడు అవ్వడం వల్ల బుచ్చిబాబు కోసం తన పారితోషికం చాలా తగ్గించి మరీ ఉప్పెన సినిమాలో నటించాను అన్నాడు.

ఉప్పెన సినిమాలో నాకు కూతురు గా నటించిన కృతి శెట్టి ని నేను హీరోగా నటించిన ఒక సినిమాలో హీరోయిన్‌ గా ఎంపిక చేయాలని దర్శకుడు నా వద్దకు ప్రపోజల్‌ తీసుకు వచ్చాడు. నేను దాన్ని సున్నితంగా తిరస్కరించాను అంటూ విజయ్‌ సేతుపతి చెప్పుకొచ్చాడు.

తమిళంలో మంచి బజ్‌ క్రియేట్‌ చేసిన విజయ్ సేతుపతి మహారాజ సినిమాను తెలుగు లో అదే టైటిల్‌ తో విడుదల చేయబోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. తెలుగు ప్రేక్షకుల్లో విజయ్‌ సేతుపతికి ఉన్న మంచి ఇమేజ్‌ నేపథ్యంలో మహారాజా తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని బాక్సాఫీస్ వర్గాల అంచనా.