బామ్మతో హీరో సెల్పీ వొంగి వొంగీ మరీ!
తమిళనాడులో లోక్ సభ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో సెలబ్రిటీలు ఎంతో ఉత్సాహంగా ఓటింగ్ లో పాల్గొన్నారు.
By: Tupaki Desk | 19 April 2024 11:20 AM GMTతమిళనాడులో లోక్ సభ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో సెలబ్రిటీలు ఎంతో ఉత్సాహంగా ఓటింగ్ లో పాల్గొన్నారు. తమ ఓటు హక్కుని అంతా వినియోగించుకున్నారు. అందుబాటులో ఉన్న వారంతా ఓటు వేసారు. విదేశాల్లో ఉన్న విజయ్ కూడా ప్రత్యేకంగా ఓటు కోసం చెన్నై వచ్చి వెళ్లారు. ఇక మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కూడా ఓటు వినియోగించుకున్నాడు. అయితే పోలీంగ్ బూత్ లైన్ లో నుంచున్న సమయంలో ఓ వృద్దురాలు విజయ్ సేతుపతితో సెల్పీ అడిగింది.
దీంతో వెంటనే ఆ అవ్వ ముందుకొచ్చేసరికి నీ నటన ఎంతో ఇష్టపడతానని చెప్పింది. సెల్పీ కోరడంతో విజయ్ సేతుపతి వీల్ చైర్ కిందకు వొంగి సెల్పీ ఇచ్చాడు. తానే స్వయంగా సెల్పీ తీసి మరి ఫోటో ఇచ్చాడు. అనంతరం ఆ అవ్వ కాళ్లకు నమస్కరించి అక్కడ నుంచి వెళ్లాడు. ఆ సమయంలో ఆయనతో అభిమానులంతా కరచాలనం చేసి అభినందించారు. ఆ పెద్దావిడ కాళ్లకు నమస్కారం చేయడంతో పెద్దలంటే ఎంత గౌరవం?.. విధేయత అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
ఈ సందర్భంగా నెటి జనులు సోషల్ మీడియా వేదికగా ఓ విషయాన్ని కూడా గుర్తు చేసారు. గతంలో ఎయిర్ పోర్టులో విజయ్ సేతుపతి ఓ ఆగంతకుడితో గొడవ పడిన ఓ వీడియో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. అప్పట్లో అది సంచలనంగానూ మారింది. విజయ్ ని సెల్పీ అడిగితే తనపై దాడి చేసాడని ఆ యువకుడి ఆరోపించాడు. ప్రతీగా విజయ్ సేతుపతి అక్కడ జరిగింది మరొకటి జరిగిందన్నది విజయ్ వెర్షన్.
చివరికి అది పోలీస్ కేస్ కూడా అయింది. ఈ విషయంలో విజయ్ సేతుపతి సోషల్ మీడియాలో ట్రోలింగ్ బారిన కూడా పడ్డాడు. తాజాగా ఆ పెద్దావిడకు విజయ్ సెల్పీ ఇవ్వడంతో ఆ నాటి ఘటన గుర్తు చేస్తున్నారు నెటి జనులు. ఇదే సెల్పీ ఆరోజు ఇచ్చి ఉంటే ? గొడవయ్యేది కాదుగా అంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం విజయ్ సేతుపతి సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.