LCU.. ఇక ఆ క్యారెక్టర్ మాత్రం ఉండదు
ఏడాదిన్నార క్రితం 'విక్రమ్' సినిమా సృష్టించిన రికార్డులు గురించి తెలిసిందే. లోకేశ్ టేకింగ్‌కు, నటీనటుల పర్‌ఫార్మెన్స్‌కు ఫిదా అవని ప్రేక్షకుడే లేడు.
By: Tupaki Desk | 1 Nov 2023 5:30 AM GMTఏడాదిన్నార క్రితం 'విక్రమ్' సినిమా సృష్టించిన రికార్డులు గురించి తెలిసిందే. లోకేశ్ టేకింగ్‌కు, నటీనటుల పర్‌ఫార్మెన్స్‌కు ఫిదా అవని ప్రేక్షకుడే లేడు. తమిళంలోనే కాదు ఈ చిత్రం తెలుగు సహా విడుదలైన ప్రతి భాషాలోనూ బాక్సాఫీస్ వద్ద వందల కోట్లను అందుకుంది. అయితే ఈ చిత్రంలో విక్రమ్‌గా కమల్ పాత్రకు ఎంత ఆదరణ లభించిందో సంతానంగా విజయ్ సేతుపతి క్యారెక్టర్‌ను కూడా ప్రేక్షకులు అంతే ఇష్టపడ్డారు.
తాజాగా ఎల్సీయూలో నెక్ట్స్ రాబోయే చిత్రాల్లో విజయ్ సేతుపతి సంతానం పాత్ర కొనసాగుతుందా లేదా అనేది క్లారిటీ ఇచ్చేశారు విజయ్ సేతుపతి. వివరాళ్లోకి వెళితే.. విక్రమ్ సినిమాలో విజయ్ సేతుపతి చేసిన సంతానం పాత్ర.. లోకల్‌గా డ్రగ్స్ మాఫియాను శాసించే వ్యక్తి. ఆ పాత్రలో నెగిటివ్ షేడ్స్, చాలా వైలెన్స్ ఉంటుందట.
అసలీ పాత్ర మొదట రాఘవ లారెన్స్ చేయాల్సింది కానీ ఆ తర్వాత విజయ్ సేతుపతికి దగ్గరికి వెళ్లడం, అది ఆయన నటించడం, ప్రేక్షకులకు విపరీతంగా నచ్చడం జరిగింది. కేవలం తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా ఆ క్యారెక్టర్ ఎక్కువమందికి నచ్చింది. సినిమా సక్సెస్ లో కీలకపాత్ర పోషించింది.
విజయ్ సేతుపతి విలన్‌గా చాలా చిత్రాల్లో నటించారు కానీ.. ఈ చిత్రం సంతానం పాత్ర మాత్రం వేరే లెవెల్ అనేలా మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ పాత్రకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. నెగెటీవ్ రోలే అయినప్పటికీ.. ప్రేక్షకులకు బాగా నచ్చేసింది. సంతానంగా నటించాడు అనడం కన్నా జీవించాడు అనడం సబబు అనేలా చేశారాయన. కానీ ఆ చిత్రంలో చివర్లో ఆయన పాత్ర చనిపోతుంది. కానీ దాన్ని క్లారిటీగా చూపించలేదు.
ఈ పాత్ర ఎల్సీయూలోని రాబోయే చిత్రాల్లో ఉంటే బాగుండు అని ప్రేక్షకులు ఆశించారు. కానీ అది ఉండదని తాజాగా లోకేశ్ కనగరాజ్ క్లారిటీ ఇచ్చేశారు. విక్రమ్ 2లో కమల్ ఢీ కొనబోయే పాత్ర మరింత బలంగా, బ్రాండ్‌గా ఉంటుందని చెప్పారు. ఆ విలన్ పాత్ర.. డ్రగ్స్ సామ్రాజ్యాన్ని మళ్లీ నిర్మించి సూర్య రోలెక్స్ పాత్రకు సహాయంగా ఉంటుందని స్పష్టత ఇచ్చారు. త్వరలోనే ఆ పాత్రల కోసం ఇతర నటులను ఎంపిక చేస్తారని చెప్పారు.