Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ గెలుపు పై విజ‌య్ ఏమ‌న్నాడంటే?

2029 ఎన్నిక‌ల‌కు జ‌న‌సేన ఎంత బ‌లంగా త‌యార‌వుతుందో? ఈ విజ‌యం చెప్ప‌క‌నే చెప్పింది.

By:  Tupaki Desk   |   5 Jun 2024 7:04 AM GMT
ప‌వ‌న్ గెలుపు పై విజ‌య్ ఏమ‌న్నాడంటే?
X

పిఠాపురంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ గ్రాండ్ విక్ట‌రీ ఇప్పుడు అంత‌టా హాట్ టాపిక్. ఆ నియోజ‌క వ‌ర్గంలో భారీ విజ‌యం సాధించ‌డంతో పాటు, ప‌వ‌న్ అభ్య‌ర్దులంతా గెల‌వ‌డంతో పార్టీ ఎంత బ‌లంగా పుంజుకుందో ఈ ఎన్నిక‌లు రుజువు చేసాయి. 2029 ఎన్నిక‌ల‌కు జ‌న‌సేన ఎంత బ‌లంగా త‌యార‌వుతుందో? ఈ విజ‌యం చెప్ప‌క‌నే చెప్పింది. ఇప్పుడు 21 అయినా..రెండు ఎంపీలే అయినా! వ‌చ్చే ఎన్నిక‌ల‌కు అది 175గా..25 మార‌డం ఖాయ‌మనే విశ్లేష‌ణ‌లు మొద‌లైపోయాయి.

కూట‌మి విజ‌యం వెనుక ప‌వ‌న్ 'గేమ్ ఛేంజ‌ర్' కావ‌డంతో ప‌వ‌న్ అతి పెద్ద శ‌క్తిగా మార‌బోతున్న‌ట్లు ఈ ఎన్నిక ఓ సూచిక‌. దేశ వ్యాప్తంగా ప‌వ‌న్ కి శుభాకాంక్ష‌ల వెల్లువ‌కొన్ని గంట‌లుగా కొన‌సాగుతూనే ఉంది. సినీ, రాజకీయ ప్ర‌ముఖులంతా విషెస్ తెలియ‌జేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో, తమిళ వెట్రి కజగం పార్టీ అధినేత విజయ్, పవన్ కల్యాణ్ కి విశేష్ తెలియ‌జేసారు. త‌న ప‌ర్స‌ర‌ల్ అకౌంట్ నుంచి కాకుండా టీవీకే పార్టీ సోషల్ మీడియా నుంచి విషెస్ తెలియ‌జేసారు.

'ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన పవన్ కల్యాణ్ కు అభినందనలు. ఏపీ అసెంబ్లీలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించినందుకు ఆనందంగా ఉంది. ప్రజల కోసం మీరు కట్టుబడిన తీరు, మీ పట్టుదల అందరికి స్ఫూర్తి దాయకం. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను` అని రాసుకొచ్చారు. అలాగే మ‌రో ట్వీట్ లో చంద్ర‌బాబు నాయుడికి అభినంద‌న‌లు తెలిపారు.

'ఏపీ ఎన్నికల్లో భారీ విజయం సాధించినందుకు చంద్రబాబు గారికి అభినందనలు. మీ నాయకత్వంలో ఏపీ అభివృద్ధి అవుతుందని ఆశిస్తున్నాను` అని పోస్ట్ చేశారు. ఇక 2029 ఎన్నిక‌ల్లో విజ‌య్ కూడా ఎన్నికల వార్ లోకి దిగుతున్న సంగ‌తి తెలిపిందే. ఇప్ప‌టికే పార్టీ స్థాపించారు. పార్టీ నిర్మాణ ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయి. ఈ ఐదేళ్ల కాలంలో పూర్తిగా రాజ‌కీయాల్ని ద‌గ్గ‌రుండి ప‌రిశీలించ‌నున్నారు. తుదిగా బ‌రిలోకి దిగుతారా? లేదా? అన్న‌ది అప్ప‌టి ప‌రిస్థితిని బ‌ట్టి ఉంటుంది.