విజయ్ వారసుడు.. ఇలా ట్విస్ట్ ఇచ్చాడేంటి..
లైకా ప్రొడక్షన్స్ లో నేటి తరం యువ హీరోతో కలిసి ఒక డిఫరెంట్ సినిమాను తెరపైకి తీసుకురాబోతున్నట్లుగా తెలుస్తోంది.
By: Tupaki Desk | 28 Aug 2023 2:21 PM GMTసినిమా ఇండస్ట్రీలో ఎవరైనా సరే నిర్మాతగా దర్శకుడుగా అలాగే క్యారెక్టర్ ఆర్టిస్టుగా గా.. ఏ క్రాఫ్ట్ లో ఉన్నవారైనా సరే కూడా వారి వారసులను వెండితెరపై హీరోలుగా పరిచయం చేయాలి అని ఎంతగానో ఆశపడుతూ ఉంటారు. ముఖ్యంగా స్టార్ హీరోల వారసులపై అభిమానుల ఫోకస్ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక కొంతమంది మాత్రమే హీరోలుగా కాకుండా డైరెక్టర్ కూడా అడుగులు వేస్తూ ఉంటారు. ఇక ఆ రూట్లో ఇటీవల ఆగ్ర హీరో వారసుడు ట్విస్ట్ ఇవ్వడం ఆశ్చర్యాన్ని కలిగించింది.
తమిళ ఇండస్ట్రీలోనే కాకుండా ఇతర భాషల్లో కూడా హీరో విజయ్ కు మంచి క్రేజ్ అయితే ఉంది. అతని సినిమాలు ఇటీవల కాలంలో మినిమం 300 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ స్థాయిలో బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ అయితే అందుకుంటున్నాయి. ఇక రాబోయే రోజుల్లో మరింత క్రేజ్ పెరుగుతుంది అని చెప్పవచ్చు. ఇలాంటి హీరో కొడుకు హీరో గానే సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెడతాడు అని ఫ్యాన్స్ కూడా ఎన్నో ఆశలు అయితే పెట్టుకున్నారు.
కానీ ఊహించని విధంగా విజయ్ కొడుకు మాత్రం ట్విస్ట్ అయితే ఇచ్చాడు. విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ కు ప్రస్తుతం 22 ఏళ్ళు. అయితే అతను హీరోగా తప్పకుండా చిత్ర పరిశ్రమ లోకి అడుగు పెడతాడు అని గతంలోనే చాలా రకాల కథనాలు అయితే వెలుపడ్డాయి. కానీ ఇప్పుడు అతను ఈరోగా కాకుండా దర్శకుడిగా తన సినిమా కెరియర్ను మొదలు పెడుతూ ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
లైకా ప్రొడక్షన్స్ లో నేటి తరం యువ హీరోతో కలిసి ఒక డిఫరెంట్ సినిమాను తెరపైకి తీసుకురాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక నేడు ఆ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. లైకా ప్రొడక్షన్స్ సుభాష్కరన్ సమక్షంలో మొదటి సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాను అని అగ్రిమెంట్ పై కూడా సంతకం చేసేసాడు. ఇక ఈ సినిమాలో ఎవరు నటిస్తారు అనే విషయంలో మాత్రం ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. కానీ విక్రమ్ కొడుకు దృవ నటించిన అవకాశం ఉన్నట్లుగా ఒక కొత్త టాక్ అయితే వినిపిస్తోంది.
సంజయ్ మొదట తన ఇంటర్మీడియట్ చదువును పూర్తి చేసుకోగానే విదేశాలకు వెళ్లి అక్కడే గ్రాడ్యుయేషన్ చేశాడు. అయితే అతను మొదట నటుడిగా ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు కూడా తమిళ మీడియాలో చాలాసార్లు వార్తలు వచ్చాయి. కానీ అతను మాత్రం ఎక్కువగా డైరెక్షన్ పైన ఫోకస్ చేసేందుకు దానికి అవసరమయ్యే కోర్సులు చేసినట్లుగా తెలుస్తుంది. జాసన్ సంజయ్ విజయ్ టోరంటో ఫిల్మ్ స్కూల్ నుంచి ప్రొడక్షన్ డిప్లొమా (2018 -2020)ను కంప్లీట్ చేశారు. అలాగే లండన్ లో స్క్రీన్ రైటింగ్ లో (రెండేళ్లు ఫాస్ట్ ట్రాకింగ్ కోర్స్) బి.ఎ. హానర్స్ (2020-2022)ను కంప్లీట్ చేశారు. ఇక అతని మొదటి సినిమా ఎలా ఉంటుందో తెలియాలి అంటే వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందే.