ఎట్టకేలకు సస్పెన్స్ కి పుల్ స్టాప్ పెట్టేసిన హీరో!
ఈ నేపథ్యంలో ఆ ఛాన్స్ ఎవరికి ఇస్తాడు? అన్నది అంతే ఆసక్తికరంగా మారింది.
By: Tupaki Desk | 3 April 2024 7:54 AM GMTతలపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఖరారైన నేపథ్యంలో చివరి సినిమా ఏది అవుతుంది? అన్న దానిపై కొన్ని రోజులుగా సస్పెన్స్ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. దీంతో కోలీవుడ్ స్టార్ మేకర్స్ అంతా చివరి సినిమా కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ ఛాన్స్ ఎవరికి ఇస్తాడు? అన్నది అంతే ఆసక్తికరంగా మారింది. తాజాగా ఆ సస్పెన్స్ కి ఎట్టకేలకు తెరపడింది. విజయ్ చివరి సినిమా ఏ దర్శకుడితో అన్నది క్లారిటీ వచ్చేసింది.
వివరాల్లోకి వెళ్తే ప్రస్తుతం విజయ్ హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో 'గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' అనే చిత్రం సెట్స్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చివరి సినిమా 'లియో-2' అవుతుందా? ఆ ఛాన్స్ లోకేష్ కనగరాజ్ కి ఇస్తాడా? కార్తీక్ సుబ్బరాజ్ ని తెరపైకి తెస్తాడా? ఆర్జే బాలాజీని రంగంలోకి దించుతాడా? హెచ్. వినోద్ సీన్ లోకి తెస్తాడా? అని ఇలా ఈ నలుగురైదుగురి మధ్య రసవత్తర సన్నివేశమే కనిపించింది. అయితే ఇది విజయ్ కి 69వ సినిమా కావడంతో రౌండ్ ఫిగర్ 70వ సినిమా కూడా పూర్తి చేస్తే ఇద్దరికీ అవకాశం ఇచ్చినట్లు గా ఉంటుందని ఊహాగానాలు తెరపైకి వచ్చాయి.
కానీ విజయ్ పొలిటికల్ కమిట్ మెంట్ ఎంత స్ట్రాంగ్ ఉంది? అంటే 69వ సినిమాతోనే నటుడిగా దూరమవుతున్నట్లు దాదాపు ఖరారైపోయింది. దర్శకుడిగా `ఖాకీ` ఫేం హెచ్. వినోధ్ ని దాదాపు ఫైనల్ చేసేసారు. ఇదో పక్కా పొలిటికల్ థ్రిల్లర్ చిత్రమని తెలుస్తోంది. రాజకీయాల్లోనే పెను సంచలనం రేపే కంటెంట్ తో విజయ్-వినోద్ రంగంలోకి దిగుతున్నట్లు కోలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సినిమాని నిర్మించే అవకాశం తెలుగు నిర్మాత డి.వి.వి దానయ్యకి అప్పగించారు. అంటే తమిళ్ తో పాటు తెలుగులోనూ ఈచిత్రాన్ని రూపొందించనున్నారని తెలుస్తోంది.
'రాజకీయాలంటే నా దృష్టిలో ఉద్యోగం కాదు. త్యాగం..నా సీనియర్ల బాటలో నడుస్తూ అందులో లోతుపాతులు తెలుసుకుంటాను. ఎప్పటి నుంచో అందుకోసం మానసికంగా సిద్దమవుతున్నాను. పూర్తిస్థాయి రాజకీయ నాయుకుడిగా మారడానికిముందు ఓ చిత్రంలో నటించాలనుకుంటున్నాను' అంటూ మరో ప్రకటన రిలీజ్ చేయడంతో విషయం అధికారికమైంది. ప్రస్తుతం విజయ్ ..వెంకట్ ప్రభు సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. వీలైనంత త్వరగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.