Begin typing your search above and press return to search.

విజయ్ సినిమా.. ఇదేమి డిమాండ్ బాబోయ్

ఇళయదళపతి విజయ్ హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ GOAT

By:  Tupaki Desk   |   13 May 2024 3:49 AM GMT
విజయ్ సినిమా.. ఇదేమి డిమాండ్ బాబోయ్
X

ఇళయదళపతి విజయ్ హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ GOAT. భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ AG ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. 200 కోట్లకి పైగా ఈ సినిమా కోసం ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీపై తమిళనాట విపరీతమైన క్రేజ్ ఉంది. యువన్ శంకర్ రాజా GOAT చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. రీసెంట్ గా ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేశారు.

సాంగ్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది కానీ ఆశించిన స్థాయిలో బజ్ క్రియేట్ చేయలేదు. మరోవైపు ఇళయదళపతి విజయ్ తమిళ రాజకీయాలలో బిజీ అయ్యేందుకు సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే పార్టీ పేరు ఎనౌన్స్ చేశారు. రాజకీయాలలోకి వెళ్లిన తర్వాత సినిమాలు పూర్తిగా వదిలేస్తానని విజయ్ చెప్పారు. GOAT మూవీ తర్వాత మరొక్క సినిమా మాత్రమే చేస్తానని క్లారిటీ ఇచ్చారు.

ఈ కారణంగా ప్రస్తుతం చేస్తోన్న GOAT మూవీపైన భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. దానికి తగ్గట్లుగానే ఈ సినిమాపై బిజినెస్ జరుగుతోంది. ఇప్పటికే ఈ మూవీ డిజిటల్ రైట్స్ అన్ని భాషలకి కలిపి 150 కోట్ల వరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఇప్పుడు మూవీ శాటిలైట్ రైట్స్ బిజినెస్ కూడా షాక్ ఇచ్చేలా ఉందని చెప్పొచ్చు.

డిజిటల్ ఎంటటైన్మెంట్ వచ్చిన తర్వాత టెలివిజన్ ప్రీమియర్ లకి ఆదరణ తగ్గింది. దీంతో శాటిలైట్ రైట్స్ కోసం టీవీ ఛానల్స్ ఎక్కువ మొత్తం పెట్టడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నాయి. అయితే GOAT మూవీ శాటిలైట్ రైట్స్ ని జీ నెట్ వర్క్ ఏకంగా 90 కోట్లకి కొనుగోలు చేసిందంట. జీ నెట్ వర్క్ ఈ మధ్యకాలంలో శాటిలైట్ రైట్స్ కోసం అత్యధిక పెట్టుబడి పెట్టిన సినిమా GOAT అని తెలుస్తోంది.

అన్ని భాషలకి సంబందించిన హక్కుల కోసం ఈ మొత్తం చెల్లించడానికి జీ నెట్ వర్క్ రెడీ అయ్యిందంట. ఈ లెక్కలు చూసుకుంటే 240 కోట్ల వరకు నాన్ థీయాట్రికల్ రైట్స్ ద్వారా ఈ మూవీ సంపాదించింది. ఇక థియేటర్స్ లో 150 కోట్ల వరకు వ్యాపారం జరిగే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. మొత్తానికి నిర్మాతలు టేబుల్ ప్రాఫిట్ తోనే GOAT చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారని అర్ధం చేసుకోవచ్చు. ఇక మరోవైపు విజయ్ తన చివరి సినిమాను సన్ ప్రొడక్షన్ లో చేసేందుకు చర్చలు జరుపుతున్నారు. H వినోత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఆ సినిమాకి విజయ్ 200 కోట్ల రెమ్యునరేషన్ అడుగుతున్నట్లు టాక్.