LCUలో లియో భాగమా కాదా.. ఇదిగో క్లారిటీ
దళపతి విజయ్ 'లియో' మూవీ మరో రోజులో గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా ఫస్ట్ రివ్యూను ఇచ్చారు తమిళనాడు మినిస్టర్, హీరో ఉదయ నిధి స్టాలిన్
By: Tupaki Desk | 18 Oct 2023 5:54 AM GMTదళపతి విజయ్ 'లియో' మూవీ మరో రోజులో గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా ఫస్ట్ రివ్యూను ఇచ్చారు తమిళనాడు మినిస్టర్, హీరో ఉదయ నిధి స్టాలిన్. దీని గురించి ఓ ట్వీట్ చేశారు. అయితే ఆ ట్వీట్ ద్వారా ఇప్పటివరకు ఉన్న సస్పెన్స్‌పై దాదాపుగా ఓ క్లారిటీ వచ్చింది. మరి ఆ ట్వీట్‌తో ఆయన నిజంగానే హింట్ ఇచ్చారా లేదా టీజ్ చేశారా అనే దానిపై పెద్ద చర్చ సాగుతోంది.
వివరాళ్లోకి వెళితే.. లియో చిత్రం ఎల్సీయూలో భాగమా కాదా అన్న సందేహం సినీ ప్రియుల్లో, విజయ్ ఫ్యాన్స్‌లో భారీగా నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం అక్టోబర్ 19న రిలీజ్ అవుతోంది. అంటే రేపు దీనిపై క్లారిటీ రానుంది. కానీ ఈలోగే ఈ విషయమై ఫస్ట్ రివ్యూ అంటూ ఉదయనిధి స్టాలిన్ ఓ ట్వీట్ పెట్టేసి ఎల్సీయూ గురించి హింట్ ఇచ్చారు.
లియో సినిమా సూపర్. సినిమాలో దళపతి యాక్టింగ్, యాక్షన్ అదిరిపోయిందని అన్నారు ఉదయ నిధి స్టాలిన్. లోకేశ్ కనకరాజ్ ఫిల్మ్ మేకింగ్ అద్భుతంగా ఉందని చెప్పారు. అనిరుధ్ మ్యూజిక్, అన్భరివ్ యాక్షన్ కొరియోగ్రఫీ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని అన్నారు. మొత్తంగా లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ అద్భుతంగా ఉందని చెప్పారు. టీమ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పుకొచ్చారు.
అయితే ఈ ట్వీట్లో ఎల్సీయూ అనే పదం బాగా హైలైట్ అయింది. ఇప్పటివరకు నెలకొన్న సస్పెన్స్‌పై దాదాపుగా ఓ క్లారిటీ వచ్చింది. ఈ చిత్రం ఎల్సీయూలో భాగమేనని అర్థమైంది. కానీ ఇదే సమయంలో కొన్ని అనుమానాలు కూడా రేకెత్తాయి. అదేంటంటే.. లోకేశ్ విక్రమ్ సినిమా రిలీజ్‌కు ముందు ఖైదీ సినిమా ఓ సారి చూడండంటూ హింట్ ఇచ్చారు. ఎందుకంటే ఆ చిత్రం ఎల్సీయూలో భాగమని చెప్పడానికి. కానీ ఇప్పుడు లియోకు అలా చేయలేదు.
మరోవైపు ఇంకొంతమంది.. ఉదయనిధి స్టాలిన్.. లోకేశ్ దాచి ఉంచిన సీక్రెట్‌ను తొందరపడి ముందుగా చెప్పేశారని అంటున్నారు. ఇంకొంతమంది.. విజయ్ ఫ్యాన్స్‌ను టీజ్ చేయడానికే ఆయన ఇలా ట్వీట్ పెట్టారా అని కూడా సందేహపడుతున్నారు. మొత్తంగా ఈ ట్వీట్ మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. అందరూ ఈ విషయం గురించే తెగ మాట్లాడుకుంటున్నారు.