Begin typing your search above and press return to search.

లియో కూడా అదే ఫార్ములా..?

ఈ మధ్యకాలంలో స్టార్ హీరోలందరూ తమ సినిమాలను సింగిల్ పార్ట్ గా కాకుండా, రెండు భాగాలుగా తీసుకువస్తున్నారు.

By:  Tupaki Desk   |   9 Aug 2023 3:00 AM GMT
లియో కూడా అదే ఫార్ములా..?
X

ఈ మధ్యకాలంలో స్టార్ హీరోలందరూ తమ సినిమాలను సింగిల్ పార్ట్ గా కాకుండా, రెండు భాగాలుగా తీసుకువస్తున్నారు. మొదటి భాగంలో క్లైమాక్స్ లో ఒక ట్విస్ట్ పెట్టి, దానిని రెండో పార్ట్ లో రివీల్ చేస్తున్నారు. బాహుబలి, కేజీఎఫ్ ఇదే ఫార్ములా ఫాలో అయ్యాయి. ఈ క్రమంలో అందరు డైరెక్టర్లు ఈ ఫార్ములాని ఫాలో అవ్వాలని అనుకుంటున్నారు. ప్రభాస్ సలార్ రెండు భాగాలుగా తీస్తున్నారు. కల్కి కూడా రెండు భాగాలు అనే టాక్ నడుస్తోంది. ఎన్టీఆర్ దేవర సైతం అదేవిధంగా రెండు భాగాలు గా తీస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు స్టార్ హీరో విజయ్ సినిమా కి అదే ప్లాన్ చేస్తున్నారట.

విజయ్ హీరోగా, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఈ లియో. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో మాష్టర్ మూవీ రాగా, బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇక, లోకేష్ చివరగా కమల్ హాసన్ తో విక్రమ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ మూవీ కాసుల వర్షం కురిపించింది. ఆ సినిమా తెలుగులోనూ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇక, విజయ్, లోకేష్ కాంబినేషన్ మూవీ అనగానే సాధారణంగానే అంచనాలు ఎక్కువగా ఉన్నాయి.

ఈ క్రమంలో, ఈ మూవీ ని ఒక్క పార్ట్ లో కాకుండా, రెండు పార్ట్స్ గా విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోందట. ఇక మొదటి పార్ట్ క్లైమాక్స్ తోనే రెండో పార్ట్ మొదలౌతుందట. ఒక రెండో భాగం 2025లో షూటింగ్ ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది. లోకేష్ తాను తీసే సినిమాల్లో ఒకదానితో మరొకటి లింక్ పెడుతూ ఉంటాడు.

కార్తీ ఖైదీ మూవీ కనెక్షన్ ని విక్రమ్ లో చూపించినట్లు, ఈ రెండు సినిమాల ఛాయలు, మళ్లీ లియోలో కూడా కనిపిస్తాయనే ప్రచారం జరుగుతోంది. ఇక, ఇప్పటికే ఈ మూవీ నుంచి విజయ్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. అది విపరీతంగా ఆకట్టకుంది. ఫస్ట్ లుక్ లో విజయ్ సుత్తి పట్టుకొని విలన్స్ తో ఫైట్ చేస్తున్నట్టు ఉంది. విజయ్ ని చాలా పవర్ ఫుల్ గా చూపించారు.

ఇక విజయ్ పక్కన తోడేలు కూడా కోపంగా చూస్తూ ఉంది. ఫుల్ మాస్ మూవీ అని ఒక ఫస్ట్ లుక్ తోనే అర్థమైపోతుంది. త్వరలోనే టీజర్, ట్రైలర్ కూడా విడుదల చేయనున్నారు. ఈ మూవీలో విలన్ గా సంజయ్ దత్ నటిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఇక, ఈ మూవీ అక్టోబర్ 19న రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే.