Begin typing your search above and press return to search.

లియోలో ఉన్నది ఒకే ఒక్కటి

ఇళయదళపతి విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ లియో.

By:  Tupaki Desk   |   27 Aug 2023 4:21 AM GMT
లియోలో ఉన్నది ఒకే ఒక్కటి
X

ఇళయదళపతి విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ లియో. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. అక్టోబర్ 19న దసరా కానుకగా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. మూవీపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇప్పటికే కోలీవుడ్ ఇండస్ట్రీలోనే హైయెస్ట్ బిజినెస్ లియో సినిమాకి జరిగింది.

తెలుగులోనే ఏకంగా 22 కోట్ల వరకు బిజినెస్ జరిగిందంటే సినిమాపై ఏ స్థాయిలో డిస్టిబ్యూటర్స్ నమ్మకంగా ఉన్నారో అర్ధంచేసుకోవచ్చు. తాజాగా రిలీజ్ అయ్యి సంచలనం సృష్టిస్తోన్న జైలర్ మూవీ కలెక్షన్స్ ని బీట్ చేయాలనే టార్గెట్ తో చిత్ర యూనిట్ ఉంది. అలాగే కోలీవుడ్ ఇండస్ట్రీకి వెయ్యి కోట్ల కలెక్షన్ తెచ్చిపెట్టే సినిమా లియో అవుతుందని అంచనా వేస్తున్నారు.

ఈ సినిమాకి సంబందించిన ఇంటరెస్టింగ్ న్యూస్ ఎప్పటికప్పుడు బయటకొస్తోంది. సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే మూవీ మొత్తానికి ఒకే ఒక్క సాంగ్ ని లోకేష్ ప్లాన్ చేశారంట. అది కూడా హీరో ఎలివేషన్ కోసం మాత్రమే అని తెలుస్తోంది. హీరోయిన్ గా త్రిష నటిస్తోన్న కంటెంట్ లో భాగంగానే ఆమె పాత్ర ఉంటుందంట.

అయితే ఏకంగా 24 బ్యాగ్రౌండ్ ఎలివేషన్ బీట్స్ ని లియో చిత్రం కోసం సిద్ధం చేసారంట. ఈ ఎలివేషన్ బీట్స్ తో మూవీకి నెక్స్ట్ లెవల్ హైప్ వస్తుందని భావిస్తున్నారు. అలాగే థియేటర్స్ లో ప్రేక్షకులకి గూస్ బాంబ్స్ రావడం ఖాయం అనే టాక్ కోలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తోంది. విక్రమ్, జైలర్ సినిమాల సక్సెస్ లలో మేజర్ పార్ట్ అనిరుద్ మ్యూజిక్ కి కూడా ఇవ్వాల్సిందే.

ఇప్పుడు మరోసారి అంతకు మించి అనేలా లియో కోసం బ్యాగ్రౌండ్ స్కోర్ సిద్ధం చేశాడంట. లోకేష్ కనగరాజ్ ఈ చిత్రాన్ని తన సినిమాటిక్ యూనివర్స్ కథలలో భాగంగానే తీస్తున్నారు. కథలో ఖైదీ, విక్రమ్ సినిమాలతో సింక్ చేస్తూ కంటెంట్ ని ప్రెజెంట్ చేస్తున్నారంట.