ఆ విషయంలో ఖైదిని ఫాలో అవుతున్న లియో
మాఫియా బ్యాక్ డ్రాప్ కథలతో సినిమాలు చేస్తూ సౌత్ లో స్టార్ డైరెక్టర్ గా లోకేష్ కనగరాజ్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్నారు.
By: Tupaki Desk | 23 Sep 2023 4:22 AM GMTమాఫియా బ్యాక్ డ్రాప్ కథలతో సినిమాలు చేస్తూ సౌత్ లో స్టార్ డైరెక్టర్ గా లోకేష్ కనగరాజ్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఇళయదళపతి విజయ్ తో లోకేష్ లియో మూవీతో ప్రేక్షకుల ముందుకి రావడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సారి పాన్ ఇండియా లెవల్ లో తన సినిమాతో సత్తా చాటాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఈ మూవీ అక్టోబర్ 19న ఏకంగా ఐదు భాషలలో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది.
ఇప్పటికే ఈ సినిమాకి సంబందించిన బిజినెస్ డీల్స్ క్లోజ్ అయినట్లు తెలుస్తోంది. భారీ అంచనాల మధ్యనే ఈ మూవీ థియేటర్స్ లోకి రావడానికి రెడీ అవుతోంది. రెగ్యులర్ గా మూవీ పోస్టర్స్ రిలీజ్ చేస్తూ సినిమాపై అంచనాలు పెంచే ప్రయత్నం లోకేష్ కనగరాజ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీ రన్ టైం నుంచి ఇప్పుడు కోలీవుడ్ సర్కిల్ లో ఇంటరెస్టింగ్ ప్రచారం నడుస్తోంది.
లియో రన్ టైం విషయంలో లోకేష్ కనగరాజ్ ఖైదిని ఫాలో అవుతున్నాడంట. ఆ సినిమా స్క్రీన్ ప్లే చాలా పెర్ఫెక్ట్ గా ఉంటుంది. అలాగే ఎక్కడా డీవియేషన్ లేకుండా చెప్పాలనుకున్న పాయింట్ ని స్ట్రైట్ గా నేరేట్ చేయడం ఖైది సూపర్ హిట్ కి ఒక కారణం అని చెప్పొచ్చు. ఈ సినిమా నిడివి చాలా తక్కువగా గా ఉంటుంది. అయితే తరువాత చేసిన మాస్టర్, విక్రమ్ సినిమాల నిడివి కాస్తా ఎక్కువగానే ఉంటుంది.
మాస్టర్ మూవీ 178 నిమిషాల రన్ టైం ఉంటే విక్రమ్ సినిమా 173 నిమిషాల రన్ టైంతో నడిచింది. ఈ చిత్రాలు సక్సెస్ అయిన కూడా లెంత్ విషయంలో కొన్ని విమర్శలు వచ్చాయి. అయితే లియో మూవీ విషయంలో అలాంటి ఛాన్స్ ఇవ్వకుండా ఉండాలని లోకేష్ డిసైడ్ అయ్యి 159 నిమిషాల రన్ టైంలోనే ఫైనల్ అవుట్ పుట్ సిద్ధం చేస్తున్నారంట. ఇప్పటికే రన్ టైం లాక్ చేసినట్లు తెలుస్తోంది.
ఇక వచ్చే నెల ఆరంభం నుంచి పూర్తిగా మూవీ ప్రమోషన్స్ పై లోకేష్ అండ్ కో దృష్టి పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. మరి భారీ అంచనాల మధ్య భారీ టార్గెట్ తో ప్రేక్షకుల ముందుకి రాబోతున్న లియో ఎలాంటి సక్సెస్ అందుకుంటునేది వేచి చూడాలి.