Begin typing your search above and press return to search.

2025 సంక్రాంతి బరిలో మరో బిగ్ హీరో మూవీ!

అయితే ‘వారిసు’లా బై లింగువల్ ప్రాజెక్టు కాకుండా పాన్ ఇండియా స్థాయిలో ఈ ప్రాజెక్టును రూపొందిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి

By:  Tupaki Desk   |   31 Jan 2024 12:30 PM GMT
2025 సంక్రాంతి బరిలో మరో బిగ్ హీరో మూవీ!
X

గత ఏడాది 'లియో' సినిమాతో భారీ సక్సెస్ అందుకున్న కోలీవుడ్ స్టార్ తలపతి విజయ్ ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో 'గోట్' సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా టైం ట్రావెలింగ్ కాన్సెప్ట్ తో రాబోతోంది. జూన్ లో ఈ సినిమాని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.


ఇదిలా ఉంటే ఈ ప్రాజెక్టు తర్వాత తలపతి విజయ్ 'RRR' నిర్మాత DVV దానయ్యతో సినిమా చేస్తున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు ఈ ప్రాజెక్టు కోసం దానయ్య విజయ్ కి భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. గతంలో విజయ్ దిల్ రాజుతో చేసిన 'వారిసు' ప్రాజెక్టు కోసం భారీ రెమ్యూనరేషన్ తీసుకున్నాడు. ఇప్పుడు దానయ్య ప్రాజెక్టు కోసం అంతకుమించి రెమ్యునరేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం.

అయితే ‘వారిసు’లా బై లింగువల్ ప్రాజెక్టు కాకుండా పాన్ ఇండియా స్థాయిలో ఈ ప్రాజెక్టును రూపొందిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక వీరి కాంబినేషన్లో రూపొందనున్న సినిమాకి డైరెక్టర్ ఎవరనే విషయం తెలియాల్సి ఉంది. ఓ కోలీవుడ్ డైరెక్టర్ ఈ ప్రాజెక్ట్ కి దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇక తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించికొన్ని కొన్ని లీక్స్ బయటికి వచ్చాయి.

దాని ప్రకారం.. విజయ్ - DVV దానయ్య కాంబినేషన్ ప్రాజెక్ట్ ని మార్చ్ లేదా ఏప్రిల్ లో సెట్స్ పైకి తీసుకెళ్లి 2025 సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు ఆన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

గత ఏడాది ఎలాగైతే దిల్ రాజుతో విజయ్ చేసిన 'వారిసు' సంక్రాంతికి రిలీజ్ అయిందో వచ్చే ఏడాది కూడా సంక్రాంతికి ప్రాజెక్టును విడుదల చేయాలని అనుకుంటున్నారట. మరోవైపు 2025 సంక్రాంతికి ఇప్పటికే హాలీవుడ్ నుంచి మెగాస్టార్ విశ్వంభర, నాగార్జున బంగార్రాజు పార్ట్-3 తో పాటూ హనుమాన్ సీక్వెల్ 'జై హనుమాన్' వంటి సినిమాలు రాబోతున్నాయి. ఇక ఈ సినిమాలకు పోటీగా తలపతి విజయ్ - DVV దానయ్య ల ప్రాజెక్ట్ ని రిలీజ్ చేయబోతుండటం గమనార్హం.