శంకర్ - విజయ్… ఇది అసలు కథ!
2017లో ఒకే ఒక్కడు సీక్వెల్ కోసం స్టోరీ సిద్ధం చేసి విజయ్ కి చెప్పారు
By: Tupaki Desk | 25 July 2023 5:13 AM GMTకోలీవుడ్ లో నెంబర్ వన్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్న దర్శకుడు శంకర్. అతని నుంచి మేగ్జిమమ్ లార్గర్ దెన్ లైఫ్ అనే సినిమాలు వస్తూ ఉంటాయి. భారీ బడ్జెట్ తో ఎవ్వరూ టచ్ చేయని పాయింట్స్ తో కథలు సిద్ధం చేసుకొని మూవీస్ చేయడం శంకర్ స్టైల్. రాజమౌళి బాహుబలితో పాన్ ఇండియా డైరెక్టర్ అనిపించుకున్న అంతకంటే ముందుగానే పాన్ లెవల్ లో రోబో సినిమాని శంకర్ చేశారు.
ఇండియాలోనే మొదటిసారిగా వందకోట్లకి పైగా బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా రోబో అని చెప్పాలి. దాని స్ఫూర్తితోనే రాజమౌళి బాహుబలి స్టార్ట్ చేశారు. ఇప్పుడు వంద కోట్లు బడ్జెట్ తో కేవలం రీజనల్ మూవీ మాత్రమే తీయగలుగుతున్నారు. శంకర్ ప్రస్తుతం రెండు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ని ఒకే సారి డీల్ చేస్తున్నాడు. కమల్ హాసన్ తో ఇండియన్ 2 మూవీ ఓ వైపు ఫినిష్ చేసే పనిలో ఉన్నారు.
అలాగే రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ మూవీ కూడా సెట్స్ పైన ఉంది. కొద్ది రోజుల క్రితం ఈ మూవీకి సంబందించిన యాక్షన్ సీక్వెన్స్ ని శంకర్ చిత్రీకరణ స్టార్ట్ చేశారు. ఇదిలా ఉంటే వీటి తర్వాత ఇళయదళపతి విజయ్ తో సినిమా చేయాలని శంకర్ అనుకుంటున్నారు.
ఇప్పటికే ఒక పొలిటికల్ థ్రిల్లర్ కథని విజయ్ కి నేరేట్ చేశారంట. ఈ కథ విజయ్ కి బాగా నచ్చిందని, అయితే ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తోంది.
దీనికంటే ముందు శంకర్ మూడు సార్లు విజయ్ కి స్క్రిప్ట్స్ చెప్పారు.2014లో మల్టీ స్టారర్ కథని విజయ్ కి నేరేట్ చేశాడు. విక్రమ్, విజయ్ కాంబినేషన్ లో ఆ మూవీ చేయాలని అనుకున్నారు.
అయితే అది కార్యరూపం దాల్చలేదు. మరల 2017లో ఒకే ఒక్కడు సీక్వెల్ కోసం స్టోరీ సిద్ధం చేసి విజయ్ కి చెప్పారు. దానికి కూడా అతను గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.
చివరిగా 2018లో ఓ సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ తో విజయ్ ని వినిపించారు. ఆ కథకి కూడా విజయ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. నిజానికి ఈ మూడు కథలు విజయ్ కి నచ్చిన ఎందుకో తనకి సెట్ కావనుకొని చేయలేదు. ఇప్పుడు శంకర్ నేరేట్ చేసిన పొలిటికల్ థ్రిల్లర్ కాన్సెప్ట్ కూడా విజయ్ కి నచ్చింది. అయితే అతని నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. మరి దేనికైనా ఒకే చెబుతాడా లేదా అనేది చూడాలి.