Begin typing your search above and press return to search.

విజయ్.. THE GOAT రేటు లియో కంటే తక్కువే

గతంలో దళపతి లియో మూవీ ఓవర్సీస్ రైట్స్ 64 కోట్లకి అమ్ముడయ్యాయి. తరువాత కమల్ హాసన్ థగ్ లైఫ్ సినిమా ఓవర్సీస్ డీల్ 63 కోట్లకి క్లోజ్ అయ్యిందంట.

By:  Tupaki Desk   |   24 Aug 2024 4:47 AM GMT
విజయ్.. THE GOAT రేటు లియో కంటే తక్కువే
X

ఇళయదళపతి విజయ్ హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన The GOAT మూవీ సెప్టెంబర్ 5న థియేటర్స్ లోకి రాబోతోంది. యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథాంశంతో రెడీ అయిన ఈ సినిమాలో విజయ్ డ్యూయల్ రోల్ లో తండ్రి కొడుకులుగా కనిపించబోతున్నాడు. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా చేసింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. యాక్షన్ సన్నివేశాలు గట్టిగానే ఉండబోతున్నాయని ట్రైలర్ ను బట్టి అర్ధమవుతోంది.

గత ఏడాది లియోతో సూపర్ హిట్ అందుకున్న విజయ్ The GOAT మూవీతో మరో బ్లాక్ బస్టర్ అందుకోవాలని అనుకుంటున్నాడు. ఇప్పటికే ఈ సినిమా బిజినెస్ డీల్స్ క్లోజ్ అయినట్లు తెలుస్తోంది. 400+ కోట్ల వరకు ఈ సినిమాపై ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు టాక్ వినిపిస్తోంది. ఓవర్సీస్ లో ఈ సినిమా రైట్స్ 53 కోట్లకి అమ్ముడయ్యాయంట. కోలీవుడ్ లో థర్డ్ హైయెస్ట్ డీల్ గా ఇది ఉంది.

గతంలో దళపతి లియో మూవీ ఓవర్సీస్ రైట్స్ 64 కోట్లకి అమ్ముడయ్యాయి. తరువాత కమల్ హాసన్ థగ్ లైఫ్ సినిమా ఓవర్సీస్ డీల్ 63 కోట్లకి క్లోజ్ అయ్యిందంట. ఓవర్సీస్ లో విజయ్ సినిమాలకి మంచి ఆదరణ ఉంది. అలాగే కోలీవుడ్ లో హైయెస్ట్ మార్కెట్ ఉన్న హీరోగా విజయ్ ప్రస్తుతం నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు. ఆయన తర్వాత స్థానంలోనే సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా ఉండటం విశేషం.

ఈ నేపథ్యంలోనే The GOAT సినిమాపై భారీగా బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. దళపతి విజయ్ ఇప్పటికే పొలిటికల్ గా యాక్టివ్ అవుతున్నారు. GOAT మూవీ తర్వాత మరొక్క సినిమా మాత్రమే చేయనున్నాడు. అది కూడా మెసేజ్ ఒరియాంటెడ్ కథాంశంతో ఉంటుందనే ప్రచారం నడుస్తోంది. దాని తర్వాత పూర్తిస్థాయిలో రాజకీయాలపై దృష్టి పెట్టనున్నారు. రీసెంట్ గా విజయ్ తన పార్టీ జెండా కూడా ఆవిష్కరించారు.

రాజకీయాల్లోకి అడుగుపెట్టాక సినిమాలుకి పూర్తిగా గుడ్ బై చెప్పబోతున్నారు. అందుకే ఫ్యాన్స్ కూడా GOAT సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా టైం ట్రావెల్ కథాంశంతో స్పై యాక్షన్ థ్రిల్లర్ గా ఉండబోతోందని ట్రైలర్ ను బట్టి అర్ధమవుతోంది. ఇలాంటి కథలు చెప్పడంలో వెంకట్ ప్రభు ఎక్స్ పర్ట్. అందుకే GOAT సినిమాపై ప్రేక్షకులకి భారీ అంచనాలు ఉన్నాయి.