పాపం పసోడు నిండా ప్రేమలో మునిగాడు
ఈ ఫోటోషూట్ వీక్షించిన విజయ్ తన ప్రేమను దాచుకోలేదు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తన లేడీ లవ్ కోసం ఒక తీపి సందేశాన్ని ఇచ్చాడు.
By: Tupaki Desk | 10 March 2024 8:17 AM GMTఅవును.. ఇతగాడి ప్రేమ పిచ్చి పీక్స్ కు చేరుకుంది. నువ్వు లేని నేను లేను.. జన్మజన్మల బంధం మనది! అంటూ ఆమెను వీడి ఉండటం లేదు! ఇక తనకు సరిజోడు, నచ్చిన చెలికాడు చిక్కాడు! అంటూ ఆమె కూడా అంతే సంబరపడుతోంది. ప్రస్తుతానికి ఆ ఇద్దరి మధ్యా బంధం పెనవేసుకుంది. ఇన్ స్టా, ఎక్స్, టీవీ, యూట్యూబ్ వేదిక ఏదైనా ఈ జంట గురించే ముచ్చట. అంతగా ఇటీవలి కాలంలో ఇండస్ట్రీ చర్చల్లోకొచ్చిన వేరొక ప్రేమకథ లేదు. ఇంతకీ ఇదంతా ఎవరి గురించి అంటే... మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా- విజయ్ వర్మ ప్రేమాయణం గురించే ఈ స్టోరి.
విజయ్ వర్మ, తమన్నా భాటియా నడుమ ఓటీటీ తెరపై అద్భుతమైన కెమిస్ట్రీ వర్కవుటైంది. అంతేకాదు.. ఇది తెరవెనక కెమిస్ట్రీకి కూడా దారి తీసింది. లస్ట్ స్టోరీస్ 2 లో చెలరేగిపోయిన ఈ జంట అటుపై తెరవెనక చాలా కథలు నడిపిస్తోందని మీడియాలో కథనాలొచ్చాయి. ఇక ఈ ఇద్దరూ తమ మధ్య డేటింగ్ గురించి బహిరంగంగానే అంగీకరించారు. ఒకరంటే ఒకరికి పరస్పర గౌరవం ప్రేమను చాటుకున్నారు. తమ సంబంధాన్ని అధికారికంగా చేసినప్పటి నుండి తమన్నా - విజయ్ తరచుగా ఒకరి సోషల్ మీడియా పోస్ట్‌లపై ఒకరు తీపి వ్యాఖ్యలను ఎక్స్ ఛేంజ్ చేసుకోవడం కనిపిస్తోంది.
ఇటీవల తమన్నా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఈవెంట్ నుండి అద్భుతమైన ఫోటోలను షేర్ చేసింది. ఈ పోస్ట్‌లో, బ్లాక్ అండ్ వైట్ డిజైనర్ చీరను ధరించి కనిపించింది. ఈ ఫోటోషూట్ వీక్షించిన విజయ్ తన ప్రేమను దాచుకోలేదు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తన లేడీ లవ్ కోసం ఒక తీపి సందేశాన్ని ఇచ్చాడు. ఫైర్- హార్ట్ ఎమోజీలతో పాటు "మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ప్రియురాలు" అని విజయ్ వర్మ అందమైన సందేశాన్ని రాశాడు. తమన్నా భాటియా బ్లాక్ అండ్ వైట్ చీర.. ఫ్లోరల్ డిజైన్ బ్లాక్ బ్లౌజ్‌తో ఎంతో అందంగా కనిపిస్తోంది.
విజయ్ - తమన్నా జంట UK- లండన్‌లో కొందరు సన్నిహితులతో కలిసి కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. అయితే ఈ జంట లండన్ షికార్ చాలా పెద్ద చర్చకు తెర తీసింది. అప్పటికే సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహించిన లస్ట్ స్టోరీస్ 2లో ఈ జంట కెమిస్ట్రీ సాన్నిహిత్యం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు నిజ జీవితంలోను రొమాన్స్ స్టార్టయిందంటూ ఒకటే ప్రచారం మొదలైంది. అయితే ఈ వార్తలను ఖండించని జంట తాము ప్రేమలో ఉన్నామని ధృవీకరించింది.