తమన్నా ప్రియుడి జీవితాన్ని మార్చిన సంఘటన
జోయా అఖ్తర్ తెరకెక్కించిన 2019 బ్లాక్ బస్టర్ మూవీ 'గల్లీ బాయ్'లో మోయిన్ అనే మాస్ అవతార్ లో కనిపించాడు విజయ్. నెగెటివ్ షేడ్ ఉన్న ఈ పాత్రలో అద్భుతంగా నటించాడు.
By: Tupaki Desk | 29 Sep 2023 3:30 AM GMTనటుడు విజయ్ వర్మ దక్షిణాది అగ్ర కథానాయిక తమన్నాతో డేటింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ జంట షికార్లు ఇటీవల మీడియా హెడ్ లైన్స్ లోకి వచ్చాయి. నిజానికి అతడు ఒక సాదాసీదా నటుడు. స్వయంకృషితో ఇప్పటికి స్టార్ అయ్యాడు. విజయ్ వర్మ నేడు హిందీ చిత్రసీమలో ప్రాముఖ్యత ఉన్న స్టార్. అతడు ఇటీవల కరీనా కపూర్- జైదీప్ అహ్లావత్‌లతో కలిసి నటించాడు. కేవలం ఒక నెల క్రితం రెండు పెద్ద వెబ్ సిరీస్‌లలో నటించాడు. ఒకటి కథానాయకుడిగా.. మరొకదానిలో విలన్‌గా. కానీ ఈ స్టార్‌డమ్ అంత తేలిగ్గా చిక్కిందా? అంటే కానే కాదు.. ఈ ఫేమ్ కొన్నేళ్ల పోరాటం తర్వాత అతడికి వచ్చింది. విజయ్ ఈ స్థాయిని ఎంజాయ్ చేయడానికి ముందు, అతడి జీవితంలో కొన్ని ముఖ్య దశలు ఉన్నాయి. నిజానికి నటనలో అతడికి అవకాశాలు అంత తేలిగ్గా రాలేదు. కొన్నేళ్ల పోరాటం తర్వాత అతడి జీవితాన్ని మార్చే ఒక సంఘటన జరిగింది.
విజయ్ మొట్టమొదట 2012 చిత్రం 'చిట్టగాంగ్'లో చిన్న పాత్రలో కనిపించాడు. ఆ తర్వాత కొన్నేళ్ల పాటు అంతగా గుర్తింపు లేని బిట్ (కనిపించి వెళ్లిపోయే) పాత్రలకే పరిమితమయ్యాడు. 2016లో 'పింక్'లో అతడి పాత్రకు ప్రశంసలు దక్కాయి. అయితే విమర్శకుల ప్రశంసలు దక్కినా దాంతో ఎక్కువ అవకాశాలు అయితే రాలేదు. అతడి జీవితాన్ని నిజంగా మార్చిన పాత్ర ఏది? అని అతడిని అడిగితే.. అది కచ్ఛితంగా గల్లీ బాయ్ లో మోయిన్ పాత్ర అని చెబుతాడు. ఎందుకంటే ఆ సినిమాలో తన నటన చూసిన తర్వాత ప్రజలు అతడిని నటుడిగా గుర్తించారు. సీరియస్ గా తీసుకోవడం ప్రారంభించారు. కొత్త అవకాశాల తలుపులు తెరుచుకున్నాయి.
జోయా అఖ్తర్ తెరకెక్కించిన 2019 బ్లాక్ బస్టర్ మూవీ 'గల్లీ బాయ్'లో మోయిన్ అనే మాస్ అవతార్ లో కనిపించాడు విజయ్. నెగెటివ్ షేడ్ ఉన్న ఈ పాత్రలో అద్భుతంగా నటించాడు. చిత్రకథానాయకుడు రణవీర్ సింగ్ పాత్రతో పోటీపడే పాత్రలో అతడికి అవకాశం దక్కింది. గల్లీ బోయ్ విజయం నటుడిగా విజయ్ వర్మకు గొప్ప అవకాశాల్ని తెచ్చి పెట్టింది. ''నేను జీవితంలో కొంచెం ఉపశమనం పొందాను. ఎందుకంటే అప్పటికి నేను దాదాపు చిద్రమైపోయాను. నేను నా జీవితంలో ఇక ఎదగలేనని అనుకున్నాను. నాశనం అంచుకు జారిపోయాను. ముందు ఏ మార్గం కనిపించలేదు. అంతా చీకటిగా ఉంది. అలాంటి సమయంలో ఈ అవకాశం నన్ను నిలబెట్టింది..'' అని విజయ్ తెలిపాడు. ఈ పాత్రలో నటనకు లభించిన ప్రశంసలు కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని తిరిగి వెనక్కి తెచ్చాయని అన్నాడు. ''గల్లీబోయ్ లో మోయిన్ పాత్ర నాకు చాలా ఉపశమనం కలిగించింది. ఇది నేను కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని మళ్లీ తెచ్చిపెట్టింది'' అని చెప్పారు.
గల్లీ బాయ్ తర్వాత ఘోస్ట్ స్టోరీస్, బాఘీ 3, ఎ సూటబుల్ బాయ్, మీర్జాపూర్, షీ వంటి వెబ్ సిరీస్‌లలో చిన్న పాత్రలు చేశాడు. కానీ డార్లింగ్స్‌తో అతడు లీడ్ పాత్రలలో కూడా అవకాశాలు అందుకుంటున్నాడు. దహాద్, కాల్‌కూట్, జానే జాన్ వంటి ప్రాజెక్ట్‌లలో లీడ్ పాత్రలు పోషించాడు. 2023 విజయ్ నామ సంవత్సరం. 37 ఏళ్లలో ఎంతో ఆనందంగా ఉన్న అరుదైన క్షణాలివి.