నోరు జారిన వర్మ... పాపం తమన్నా బుక్!
మిల్కీ బ్యూటీ తమన్నా ఈ మధ్య కాలంలో సినిమాలతో కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో కనిపిస్తుంది.
By: Tupaki Desk | 2 July 2024 2:30 PM GMTమిల్కీ బ్యూటీ తమన్నా ఈ మధ్య కాలంలో సినిమాలతో కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో కనిపిస్తుంది. వెబ్ సిరీస్ ల్లో నటించడంతో పాటు, ప్రత్యేక పాటల్లో కనిపించడం, మ్యూజిక్ వీడియోలు చేయడం, ప్రముఖ మ్యాగజైన్ కవర్ పై అందాలు ఆరబోత చేస్తూ ఫోటోలకు ఫోజ్ ఇవ్వడం వంటి కారణాల వల్ల వార్తల్లో నిలుస్తున్న విషయం తెల్సిందే.
ఇక గత కొంత కాలంగా విజయ్ వర్మ తో మిల్కీ బ్యూటీ తమన్నా ప్రేమలో ఉందనే విషయం అందరికి తెలిసిందే. చాలా కాలంగా ఈ అమ్మడు తన ప్రేమ విషయాన్ని బాహాటంగా చెప్పడం లేదు, అలా అని కొట్టిపారేయడం లేదు. అయితే ఇద్దరు చట్టాపట్టాలేసుకుని తిరగడం వల్ల ఇద్దరూ ప్రేమలో ఉన్నారు అనేది నిర్ధారణ అయ్యింది.
కొన్ని వారాల క్రితం వీరిద్దరు కలిసి నటించిన లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ ప్రమోషన్ లో భాగంగా మీడియా ముందుకు వచ్చారు. ఆ సమయంలో కూడా వీరిద్దరి గురించి ప్రధానంగా చర్చ జరిగింది. ఇప్పుడు మీర్జాపూర్ 3 వెబ్ సిరీస్ ప్రమోషన్ లో భాగంగా విజయ్ వర్మ మీడియా ముందుకు వచ్చి శృంగార సంబంధిత వ్యాఖ్యలు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు.
విజయ్ వర్మ మాట్లాడుతూ... జీవితంలో చాలా మంది నుంచి చాలా విషయాలు నేర్చుకుంటాం. అయితే మన పార్టనర్స్ నుంచి ఎక్కువ విషయాలు నేర్చుకునే అవకాశం ఉంటుంది. మన గురించి మనం మార్చుకునే అవకాశం కూడా పార్టనర్ వల్ల కలుగుతుంది.
ముఖ్యంగా సెక్సువల్ గా ప్రతి విషయం సొంతంగా తెలుసుకోవడం కష్టం. ఆ విషయంలో పార్టనర్ వల్లే చాలా విషయాలు తెలుస్తాయి అన్నాడు. ఎప్పుడైతే సరైన ఎనర్జీ ఉన్న పార్టనర్ తో కలుస్తామో అప్పుడే అబ్బాయి నుంచి మగాడిగా మారిన ఫీల్ కలుగుతుందని విజయ్ వర్మ అన్నాడు.
ఎంత మీర్జాపూర్ ప్రమోషన్ అయితే మాత్రం మరీ ఇంత పచ్చిగా మాట్లాడాలా అంటూ విజయ్ వర్మను చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. మరి కొందరు తమన్నా ను ఈ టాపిక్ లోకి లాగి మీరు ఎంతవరకు తమన్నా నుంచి నేర్చుకున్నారు, మీరు తమన్నా కారణంగా మగాడిగా ఫీల్ అయ్యారా అంటూ ప్రశ్నిస్తున్నారు. విజయ్ చేసిన వ్యాఖ్యలకు తమన్నా ను ఇందులోకి లాగడం సరైన పద్దతి కాదు. నెటిజన్స్ విజయ్ వర్మ వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారనే అభిప్రాయం కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు.