ఆ స్టార్ 63 కోసం మావీరన్ రంగంలోకి
తంగలాన్ మాత్రం విక్రమ్ నటనకు మరోసారి తార్కారణంగా నిలిచింది.
By: Tupaki Desk | 13 Dec 2024 6:55 AM GMTచియన్ విక్రమ్ 'తంగలాన్' సక్సెస్ తో కంబ్యాక్ అయిన సంగతి తెలిసిందే. చాలా కాలంగా వైఫల్యాల్లో ఉన్న విక్రమ్ కి తంగలాన్ మంచి బూస్టింగ్ ఇచ్చింది. అంతకు ముందు రిలీజ్ అయిన పొన్నియన్ సెల్వన్ గ్రాండ్ సక్సెస్ అయినా? అందులో విక్రమ్ తో పాటు చాలా మంది హీరోలు నటించారు. దీంతో అది విక్రమ్ సోలో సక్సెస్ కాలేకపోయింది. తంగలాన్ మాత్రం విక్రమ్ నటనకు మరోసారి తార్కారణంగా నిలిచింది. పాన్ ఇండియాలో సినిమా అన్ని భాషలకు కనెక్ట్ కాలేకపోయినా తెలుగులోనే బాగానే ఆడింది.
విక్రమ్ నటనకు మరోసారి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ప్రస్తుతం విక్రమ్ వీర ధూర శూరన్ రెండవ భాగంలో నటిస్తున్నాడు. ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు మంచి హైప్ తీసుకొచ్చాయి. త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకొస్తుంది. అయితే ఆ సినిమా రిలీజ్ కి ముందే చియాన్ 63 కూడా కన్పమ్ అయింది. ఈసారి మావీరన్ దర్శకుడు మడోన్ అశ్విన్ తో జత కడుతున్నాడు.
ఇద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా వస్తున్నట్లు శాంతి టాకీస్ అధికారికంగా ప్రకటించింది. `మావీరన్` చిత్రాన్ని ఇదే నిర్మాణ సంస్థ నిర్మించి బ్లాక్ బస్టర్ అందుకుంది. దీంతో అదే సంస్థ అదే దర్శకుడితో రెండవ సినిమా నిర్మించడం విశేషం. అరుణ్ విశ్వ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. విక్రమ్ తో సినిమా అంటే భారీ కాన్వాస్ పైనే తెరకెక్కించే అవకాశం ఉంటుంది.
మరి ఎలాంటి స్టోరీతో ప్రేక్షకుల ముందుకొస్తారో చూడాలి. ప్రస్తుతం విక్రమ్ హీరోగా వీర ధీర శూనర్ లో నటిస్తున్నాడు . ఈ సినిమా వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ అవుతుంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఆ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. రిలీజ్ నేపథ్యంలో యూనిట్ ప్రచారం పనులకు రెడీ అవుతోంది. ఇంతలోనే విక్రమ్ 63వ ప్రాజెక్ట్ అధికారికంగా బయటకు రావడం విశేషం.