Begin typing your search above and press return to search.

20 ఏళ్ళ నుంచి హిట్టు లేదు.. హీరోపై 100 కోట్లు!

కమల్ హాసన్ తర్వాత సౌత్ ఇండియాలో విలక్షణ నటుడిగా మంచి పేరున్న స్టార్ అంటే చియాన్ విక్రమ్ అని వెంటనే చెబుతారు.

By:  Tupaki Desk   |   25 July 2024 4:47 AM GMT
20 ఏళ్ళ నుంచి హిట్టు లేదు.. హీరోపై 100 కోట్లు!
X

కమల్ హాసన్ తర్వాత సౌత్ ఇండియాలో విలక్షణ నటుడిగా మంచి పేరున్న స్టార్ అంటే చియాన్ విక్రమ్ అని వెంటనే చెబుతారు. సినిమాలో క్యారెక్టర్ కోసం తనని తాను ఏ విధంగా అయినా మార్చుకోగల సత్తా విక్రమ్ కి ఉంది. అతని ప్రత్యేకత కూడా అదే. కమర్షియల్ సినిమా చేయాలన్న, ప్రయోగాత్మక కథలతో దర్శకులు వచ్చిన విక్రమ్ సిద్ధంగా ఉంటారు. క్యారెక్టర్ నచ్చితే దానికోసం తనను తాను పూర్తిగా మార్చేసుకుంటారు.

స్టార్స్ లో చాలామంది ఏ సినిమాలో క్యారెక్టర్ చేసిన తమ బాడీ లాంగ్వేజ్ కి సెట్ అయ్యే విధంగా ఆ పాత్రని మార్చేసుకుంటారు. కానీ విక్రమ్ మాత్రం ఆ క్యారెక్టర్ కి సరిపోయే విధంగా తన బాడీ లాంగ్వేజ్, ఫిజిక్ చేంజ్ చేసుకుంటారు. అందుకే విలక్షణ నటుడిగా సౌత్ లో అతనికి ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. అయితే చియాన్ విక్రమ్ 20 ఏళ్ల క్రితం అపరిచితుడు సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు.

ఆ తర్వాత చాలా సినిమాలు చేసిన అపరిచితుడు రేంజ్ సక్సెస్ ని మళ్ళీ చూడలేదు. ఆయన సినిమాలు కమర్షియల్ హిట్ అయిన కూడా విపరీతమైన హైప్, ఇంపాక్ట్ క్రియేట్ చేసి మూవీస్ అయితే రాలేదని చెప్పాలి. కమర్షియల్ హీరోగా కోలీవుడ్ లో విక్రమ్ కి సాలిడ్ మార్కెట్ ఉంది. తెలుగులో మాత్రం ఆయన సినిమాలు డబ్బింగ్ వెర్షన్ లో రెగ్యులర్ గా వస్తూనే ఉన్న పెద్దగా ప్రభావం చూపించడం లేదు.

2022లో విక్రమ్ మహాన్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో తన కొడుకు ధృవ్ విక్రమ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కి డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అయ్యింది. సినిమా బాగుందనే టాక్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత వచ్చిన కోబ్రా ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేదు. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన పొన్నియన్ సెల్వన్ సిరీస్ లో ఆదిత్య కరికాలన్ గా విక్రమ్ నటించారు. ఆయన క్యారెక్టర్ కి ప్రశంసల లభించినా కూడా మూవీ సిరీస్ సక్సెస్ కాలేదు.

ప్రస్తుతం తంగలాన్ సినిమాతో చియాన్ విక్రమ్ ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. పా రంజిత్ దర్శకత్వంలో పీరియాడికల్ జోనర్ లో ఈ మూవీ తెరకెక్కింది. ఈ చిత్రంలో విక్రమ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఒక క్యారెక్టర్ లో ట్రైబల్ వీరుడిగా కనిపిస్తున్నాడు. ఈ క్యారెక్టర్ కోసం విక్రమ్ తనని తాను పూర్తిగా మార్చుకొని సన్నగా అయ్యారు. అలాగే సినిమా మొత్తం కేవలం ఒక గోచితో కనిపించబోతున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ కి మంచి స్పందన వచ్చింది. ఓ విధంగా ప్రాణం పెట్టి తంగలాన్ సినిమాని విక్రమ్ చేశాడని చెప్పొచ్చు.

ఈ సినిమా చియాన్ విక్రమ్ కి డూ ఆర్ డై లాంటిది. అపరిచితుడు లాంటి ఇంపాక్ట్ ఫుల్ సక్సెస్ అందుకొని 20 ఏళ్లు అయిపోతుంది. ఈసారి అతని ఆశలన్నీ కూడా తంగలాన్ సినిమా పైనే ఉన్నాయి. ఈ సినిమా కోసం ఏకంగా 100 కోట్ల వరకు బడ్జెట్ అయినట్లు తెలుస్తోంది.1 పా రంజిత్ కి కోలీవుడ్ లో దర్శకుడిగా మంచి సక్సెస్ లు ఉన్నాయి. ఆయన ఎంచుకునే కాన్సెప్ట్ లు కూడా చాలా ఎమోషనల్ ఇంపాక్ట్ కంటెంట్ లతో ఉంటాయి. అందుకే తంగలాన్ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. మరి వాటిని ఏమేరకు అందుకుంటారు అనేది చూడాలి.