Begin typing your search above and press return to search.

తంగ‌లాన్ వేట‌కు రెడీ అవుతోంది!

ముందుగా జ‌న‌వ‌రిలో రిలీజ్ చేయాల‌నుకున్నారు. కానీ కుద‌ర‌క‌పోవ‌డంతో అటుపై ఏప్రిల్ కి వాయిదా వేసారు.

By:  Tupaki Desk   |   17 Jun 2024 5:39 AM GMT
తంగ‌లాన్ వేట‌కు రెడీ అవుతోంది!
X

చియాన్ విక్ర‌మ్ కి సోలో స‌క్సెస్ ప‌డి చాలా కాల‌మ‌వుతోంది. విక్ర‌మ్ న‌టించిన `పొన్నియ‌న్ సెల్వ‌న్` మంచి విజ‌యం సాధించినా? క్రెడిండ్ అంతా అత‌డికే సొంతం కాదు. అది మ‌ల్టీ స్టార‌ర్ కావ‌డంతో చియాన్ సోలో స‌క్సెస్ ని ఎంజాయ్ చేయ‌లేక‌పోయాడు. అంత‌కు ముందు న‌టించిన సోలో సినిమాల‌న్నీ స‌రిగ్గా ఆడ‌లేదు. ఇది అత‌డి మార్కెట్ పై కూడా ప్ర‌భావం చూపించింది. అప్ప‌టి నుంచి విజ‌యం అంద‌ని ద్రాక్ష‌లా మారింది.

దీంతో స‌క్స‌స్ కోసం దాహంతో ఎదురు చూస్తున్నాడు. ఇప్ప‌టికే విక్ర‌మ్ న‌టించిన `తంగ‌లాన్` పై ఎలాంటి అంచ‌నాలున్నాయో చెప్పాల్సిన ప‌నిలేదు. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ తోనే అంచ‌నాలు పీక్స్ కి చేరాయి. అటుపై రిలీజ్ అయిన ప్ర‌తీ ప్ర‌చార చిత్రం అంత‌కంత‌కు భారీ హైప్ తీసుకొచ్చింది. సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ స‌హా అంతా పూర్తి చేసుకున్నా ఇంత‌వ‌ర‌కూ రిలీజ్ అవ్వ‌లేదు. వాస్త‌వానికి ఈ సినిమా ఇప్ప‌టికే రిలీజ్ అవ్వాలి.

ముందుగా జ‌న‌వ‌రిలో రిలీజ్ చేయాల‌నుకున్నారు. కానీ కుద‌ర‌క‌పోవ‌డంతో అటుపై ఏప్రిల్ కి వాయిదా వేసారు. ఆనెల‌లో రిలీజ్ అయితే సెలువులు కూడా క‌లిసొస్తాయ‌ని యూనిట్ భావించింది. కానీ అనివార్య కార‌ణాల‌తో మ‌ళ్లీ వాయిదా ప‌డింది. అప్ప‌టి నుంచి ఇంత‌వ‌ర‌కూ కొత్త రిలీజ్ తేదీని ప్ర‌క‌టించ‌లేదు. దీంతో సినిమా విష‌యంలో అంత‌ర్గ‌తంగా విబేధాలేమైనా త‌లెత్తాయా? ఆ కార‌ణంగానే వాయిదా ప‌డుతుందా? అన్న సందేహాలు కోలీవుడ్ మీడియాలో మొద‌ల‌య్యాయి. కానీ వీటిపై క్లారిటీ లేదు.

ఈ నేప‌థ్యంలో తాజాగా ఆగ‌స్టులో చిత్రాన్ని రిలీజ్ చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు తెలిసింది. ఈసారి మాత్రం రిలీజ్ వాయిదా లేకుండా ఎట్టి ప‌రిస్థితుల్లో ఆనెల‌లో రిలీజ్ చేయాల‌ని ధృడ సంక‌ల్పంతో ఉన్న‌ట్లు చ‌ర్చ సాగుతుంది. ఈ చిత్రానికి పా రంజిత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సంగ‌తి తెలిసిందే. ఇందులో విక్రమ్ జోడీగా మాళ‌వికా మోహ‌న‌న్ న‌టించింది. జీవి. ప్ర‌కాష్ సంగీతం అందించాడు.