20 నిమిషాలు ఏడ్చేసిన నటుడు!
69వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో `ట్వెల్త్ ఫెయిల్` ఏకంగా నాలుగు అవార్డులు గెలుచుకున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 2 Feb 2024 2:30 AM GMT69వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో `ట్వెల్త్ ఫెయిల్` ఏకంగా నాలుగు అవార్డులు గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఉత్తమ చిత్రంతో పాటు ఉత్తమ నటుడిగా విక్రాంత్ మాస్సే క్రిటిక్స్ విభాగం నుంచి అవార్డు కైవసం చేసుకు న్నాడు. ఐపీఎస్ మనోజ్ కుమార్ శర్మ పాత్రలో విక్రమ్ నటనకు ప్రత్యేకమైన గుర్తింపు రావడంతోనే ఈ అరు దైన గౌరవం దక్కింది. విధు వినోద్ చోప్రా ఈ చిత్రాన్ని ఎంతో గొప్పగా తెరకెక్కించడంతోనే సాధ్యమైంది.
తాజాగా ఆ పాత్రలో నటించడంపై..అవార్డు రావడంపై విక్రాంత్ మాస్సే ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. `తొలిసారి ఈ కథ విన్నప్పుడు నాకు తెలియకుండానే 20 నిమిషాలు ఏడ్చేసాను. ఇలాంటి కథ ఎప్పుడూ వినలేదు. ఇలాంటి సినిమాలో నటించడం అదృష్టం భావిస్తున్నాను. ఈ కథ నా మనసును కదిలించింది. స్క్రిప్ట్ చదివేటప్పుడు ఎక్కడో ఓచోట నన్ను నేను చూసుకున్నట్లు అనిపించింది.
మనోజ్ జీవితంలో ఎన్నో జరిగాయి. అయినప్పటికీ ఆయన అందమైన జీవితాన్ని గడుపుతున్నారు. అన్ని కష్టాలు ఉన్నప్పటికీ ఎన్నో పోరాటాలు చేసి జవితంలో విజయం సాధించారు. ఆయన జీవితం నాకు ప్రేరణగా నిలిచింది. ఇలాంటి కథలు మరిన్ని రావాలి. యువతని చైతన్య పరచడానికి ఇలాంటి కథలు ఎంతో దోహదం చేస్తాయి. తప్పకుండా ప్రతీ ఒక్కరూ చూడాల్సిన సినిమా ఇది` అని అన్నారు.
ప్రస్తుతం విక్రాంత్ `ది సబర్మతి రిపోర్ట్`.. `టీఎమ్ ఈ`..` సెక్టార్ 36` లాంటి చిత్రాల్లో నటిస్తున్నాడు.ఈ మూడు సినిమాలపై బాలీవుడ్ లో మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి. ఇంకా ఆయన నటిస్తున్న కొన్ని చిత్రాలు ఆన్ సెట్స్ లో ఉన్నాయి. `లూటేరా` చిత్రంతో విక్రాంత్ బాలీవుడ్ లో తెరంగేట్రం చేసాడు. ఆ తర్వాత చాలా హిట్ చిత్రాల్లో నటించిన నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు.