Begin typing your search above and press return to search.

ప్రభాస్ ని మారుతి అలా చూపించగలిగితే రికార్డులే..!

మారుతి సినిమాతో మళ్లీ తన వింటేజ్ లుక్ తో కనిపించి ఫ్యాన్స్ ని అలరించనున్నాడు ప్రభాస్. ఫస్ట్ లుక్ లో ఈమధ్య కాలంలో కనిపించిన పాత్రలకు భిన్నంగా లుంగి లుక్ తో ప్రభాస్ అదుర్స్ అనిపించాడు.

By:  Tupaki Desk   |   15 Jan 2024 11:30 PM GMT
ప్రభాస్ ని మారుతి అలా చూపించగలిగితే రికార్డులే..!
X

బాహుబలి తర్వాత తనకు వచ్చిన భారీ ఇమేజ్ తో వరుస పాన్ ఇండియా సినిమాలనే చేస్తూ వస్తున్నాడు ప్రభాస్. రీసెంట్ గా వచ్చిన సలార్ 1 సీజ్ ఫైర్ లో కూడా రెబల్ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చేలా కనిపించాడు ప్రభాస్. సడెన్ గా మారుతి డైరెక్షన్ లో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాడు ప్రభాస్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాకు టైటిల్ గా రాజా సాబ్ అని ఫిక్స్ చేశారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ నేడు రిలీజైంది. ఈ లుక్ చూడగానే రెబల్ స్టార్ ఫ్యాన్స్ అంతా కూడా వింటేజ్ ప్రభాస్ ని చూసినట్టు ఉందని అంటున్నారు.

ప్రభాస్ మాస్ ఆడియన్స్ కు దగ్గరైన సినిమాలు కొన్ని ఉన్నాయి. బాహుబలి తర్వాత పాన్ ఇండియా ఇమేజ్ రావడంతో సూటు బూటు ఉన్న సినిమాలతో లార్జర్ ద్యాన్ లైఫ్ పాత్రల్లో కనిపిస్తున్నాడు కానీ బాహుబలి ముందు వరకు రెగ్యులర్ మాస్ కమర్షియల్ పాత్రల్లో మెప్పించాడు ప్రభాస్. మళ్లీ మారుతి సినిమాతో అలాంటి పాత్రలో కనిపిస్తున్నాడు ప్రభాస్. ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఇలాంటి రోల్స్ తమ అభిమాన హీరో నుంచి ఆశిస్తున్నారు. బాహుబలి పాత్రల గురించి తెలిసిందే. ఆ తర్వాత వచ్చిన సాహోలో స్టైలిష్ లుక్ తో కనిపించాడు ప్రభాస్.

ఆదిపురుష్ లో రాముడిగా నటించాడు. రాధే శ్యాం లో కూడా దాదాపు అదే స్టైలిష్ లుక్ తో కనిపించాడు. అయితే సలార్ లో ఫుల్ మాస్ యాక్షన్ హీరోగా కనిపించాడు. మారుతి సినిమాతో మళ్లీ తన వింటేజ్ లుక్ తో కనిపించి ఫ్యాన్స్ ని అలరించనున్నాడు ప్రభాస్. ఫస్ట్ లుక్ లో ఈమధ్య కాలంలో కనిపించిన పాత్రలకు భిన్నంగా లుంగి లుక్ తో ప్రభాస్ అదుర్స్ అనిపించాడు. మారుతి సినిమాల్లో క్యారెక్టరైజేషన్ కూడా కొత్తగా ఉంటుంది. తప్పకుండా ఈ రాజా సాబ్ రెబల్ ఫ్యాన్స్ కి ఒక స్పెషల్ క్రేజ్ తెస్తుందని చెప్పొచ్చు.

రాజా సాబ్ సినిమాను కూడా పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. సినిమాతో మారుతి కూడా పాన్ ఇండియా డైరెక్టర్ అవ్వనున్నాడు. ఎలాగు ఫస్ట్ లుక్ ఫ్రెష్ గా అదిరిపోయింది కాబట్టి సినిమా నుంచి ఆ టీజర్ కూడా వచ్చి అది కాస్త అదిరిపోతే మాత్రం రాజా సాబ్ మీద నేషనల్ మీడియాలో కూడా బజ్ పెంచే ప్రయత్నాలు జరుగుతాయి. ప్రభాస్ కి ఈ రాజా సాబ్ ఒక మంచి చేంజ్ ఓవర్ సినిమా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. రాజా డీలక్స్ మాల్ చుట్టూ జరిగే ఈ కథ తో రాజా సాబ్ వస్తుందట. ఈ సినిమా రిలీజ్ ఎప్పుడన్నది మాత్రం మేకర్స్ అనౌన్స్ చేయలేదు.