Begin typing your search above and press return to search.

తాగి బూతులు తిట్టిన నటుడు

మరోసారి వినాయకన్‌ తన పక్కింటి వ్యక్తిని బూతులు తిడుతున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

By:  Tupaki Desk   |   21 Jan 2025 7:06 AM GMT
తాగి బూతులు తిట్టిన నటుడు
X

మలయాళ నటుడు వినాయకన్ ఆ మధ్య ఎయిర్‌పోర్ట్‌లో సెక్యూరిటీ ఆఫీసర్‌పై చేయి చేసుకోవడం చర్చనీయాంశం అయ్యింది. ఆ సమయంలోనే వినాయకన్ తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అంతకు ముందు అంటే 2023లో అతడిపై న్యూసెన్స్‌ కేసు నమోదు అయ్యింది. కేరళ పోలీసులు అరెస్ట్‌ చేసి జైల్లోనూ వేశారు. అయినా వినాయకన్‌ తీరు మారలేదు. మళ్లీ మళ్లీ అదే విధంగా ప్రవర్తిస్తున్నాడు. అతడి ఇంటి పక్కన వారికి ఇబ్బంది కలిగిస్తూ రచ్చ చేస్తూనే ఉన్నాడు. మరోసారి వినాయకన్‌ తన పక్కింటి వ్యక్తిని బూతులు తిడుతున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

వినాయకన్‌ బాగా తాగి బూతులు తిట్టాడు. ఒంటి మీద లుంగీ మాత్రమే ఉంది. ఆ లుంగీ ఊడి పోతూ ఉంటే దాన్ని చుట్టుకుంటూ పక్కింటి వ్యక్తిపై బూతులు తిడుతూ ఉన్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. వినాయకన్‌ బాగా తాగి ఉన్నాడు. కనీసం స్టడీగా నిల్చోలేక పోయాడు. తూలుతూ కింద పడుతూ లేస్తూ తన బూతులను కంటిన్యూ చేశాడు. అతడిని చుట్టూ ఉన్న వారు తమ ఫోన్‌ కెమెరాల్లో బందిస్తున్నారు అనే విజ్ఞత కూడా లేకుండా ఇష్టానుసారంగా బూతులతో విరుచుకు పడ్డాడు.

రజనీకాంత్ హీరోగా నటించిన జైలర్‌ సినిమాతో పాటు పలు మలయాళ సినిమాల్లో నటించి నటుడిగా మంచి పేరు సొంతం చేసుకున్న వినాయకన్‌ ఇలా తాగి బూతులు మాట్లాడుతూ న్యూసెన్స్ క్రియేట్‌ చేయడం చూసి చాలా మంది షాక్ అవుతున్నారు. మరీ ఇంత నీచంగా ప్రవర్తించిన నటులను మేము ఎక్కడా చూడలేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. నటుడు అంటే మినిమం డీసెన్సీ మెయింటెన్ చేయాలి. కానీ వినాయకన్‌కి ఆ డీసెన్సీ అనేది లేదు. కనుక అతడు ఇండస్ట్రీలో ఉండేందుకు అర్హుడు కాదని కొందరు వాదిస్తున్నారు.

ఇలా పదే పదే ఇండస్ట్రీ పరువు తీసే విధంగా ప్రవర్తిస్తున్న వినాయకన్‌ను సినిమాల్లో నటించకుండా బహిష్కరించాలి అంటూ కొందరు డిమాండ్‌ చేస్తున్నారు. ముందు ముందు అతడు కెమెరా ముందుకు రాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు. తాను ఒక నటుడిని అనే అహంభావంతో అతడు ఇతరులపై బూతులు తిట్టడంతో పాటు, ఇతరుల మీదకు చేయి లేపడం చేస్తున్నాడు. అందుకే అతడిని నటన నుంచి బహిష్కరిస్తే బాగుంటుంది అంటూ చాలా మంది ఇండస్ట్రీ పెద్దలకు సూచిస్తున్నారు.