Begin typing your search above and press return to search.

పందిలా తిని.. కుక్కలా ఎక్సరసైజ్!

బాలీవుడ్ స్టార్ స‌ల్మాన్ ఖాన్ ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. కోట్లాది మంది అభిమానులున్న పెద్ద స్టార్ అత‌ను

By:  Tupaki Desk   |   9 March 2024 5:36 PM
పందిలా తిని.. కుక్కలా ఎక్సరసైజ్!
X

బాలీవుడ్ స్టార్ స‌ల్మాన్ ఖాన్ ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. కోట్లాది మంది అభిమానులున్న పెద్ద స్టార్ అత‌ను. ఆన్ సెట్స్ లో ఎంత సీరియ‌స్ గా ఉంటాడో? ఆఫ్ ది సెట్స్ లో అంతే స‌ర‌ద‌గా ఉంటాడు. అలాంటి స్టార్ కి ఓ ప్రాణ స్నేహితుడు ఉన్నాడు. అత‌డే వింద్ దార సింగ్. ఇద్ద‌రి మ‌ధ్య స్నే హం కొన్నేళ్ల‌గా కొన‌సాగుతుంది. కాలేజీలో మొదలైన ప‌రిచ‌యం స్నేహంగా మ‌రి అది మ‌రింత స్ట్రాంగ్ అయింది. తాజాగా స‌ల్మాన్ పై వింద్ దార సింగ్ చేసిన వ్యాఖ్య‌ల‌తో ఇద్ద‌రి మ‌ధ్య స్నేహం ఏ స్థాయిలో ఉందో చెప్ప‌డానికి ఇదొక మ‌చ్చు తున‌క లాంటింది.

స‌ల్మాన్ సీక్రెట్స్ కొన్నింటిని దార సింగ్ రివీల్ చేసాడు. ఇంత‌కీ ఏంటా సీక్రెట్స్ అంటే? స‌ల్మాన్ మంచి భోజ‌న ప్రియుడు అట‌. మూడు పూట‌లు పుల్లుగా లాగిస్తాడుట‌. ఆ విష‌యంలో రాజీ ప‌డేదే ఉండ‌ద‌ట‌. అంతే స‌ర‌దాగా పందిలా తింటాడు..కుక్క‌లా ఎక్స‌రసైజ్ చేస్తాడ‌ని అనేసారు. తిన్న‌దంతా ఎక్స‌ర‌సైజ్ చేసి చెమ‌ట రూపంలో క‌రిగేస్తాడ‌న్నారు. తిన్న‌దంతా ఎక్క‌డికి పోతుంది అంటే? ఎక్స‌ర‌సైజ్ రూపంలో బ‌య‌ట‌కు పంపిస్తాన‌ని స‌ల్మాన్ స‌ర‌ద‌గా అంటుటాడుట‌.

స‌ల్మాన్ చాలా అద్భుత‌మైన వ్య‌క్తి అని పొగిడేసాడు. తనది మంచి మనసు అని.. సహాయం చేసే గుణం నిండుగా ఉంద‌న్నారు. తన తండ్రి సలీమ్ ఖాన్ ప్రతిరోజు సల్మాన్ కు డబ్బులిచ్చేవారుట‌. ఆ డబ్బులను ఇంట్లో పనిచేసేవారికి స‌ల్మాన్ ఇచ్చేవారుట‌. రూ.50 వేలు ఇచ్చినా.. లక్ష రూపాయలిచ్చినా సరే దానిని పేదవాళ్లకు దానం చేసేవారుట‌. ఇప్ప‌టివ‌ర‌కూ ఇలాంటి దాన ధ‌ర్మాలెన్నో లెక్క‌లేన‌న్ని చేసాడని అన్నారు.

నెలకు రూ.25-30 లక్షల వరకు దానం రూపంలోనే చేస్తాడ‌న్నారు. ఇప్ప‌టికీ త‌న‌కి పాకెట్ మ‌నీ కావాలంటే తండ్రినే అడుగుతాడ‌న్నారు. దార సింగ్ వ్యాఖ్య‌ల్ని బ‌ట్టి స‌ల్మాన్ ఎంత గొప్ప స్నేహితుడో గెస్ చేయోచ్చు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.