చావా కవి కలాష్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?
శంభాజీ పాత్రలో నటించిన విక్కీ కౌశల్ తర్వాత ఆడియన్స్ బాగా కనెక్ట్ అయిన పాత్ర ఇది.
By: Tupaki Desk | 20 Feb 2025 5:15 PM GMTచత్రపతి శివాజీ మహారాజ్ కొడుకు శంభాజీ మహారాజ్ కథతో తెరకెక్కిన సినిమా చావా. ఈమధ్యనే రిలీజైన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. విక్కీ కౌశల్ లీడ్ రోల్ లో నటించిన చావా సినిమాలో రష్మిక మందన్న యేసు బాయి పాత్రలో నటించగా ఈ సినిమాలో కవి కలాష్ పాత్రలో నటించి ప్రేక్షకుల హృదయాలను గెలిచాడు వినీత్ కుమార్ సింగ్. శంభాజీ పాత్రలో నటించిన విక్కీ కౌశల్ తర్వాత ఆడియన్స్ బాగా కనెక్ట్ అయిన పాత్ర ఇది.
కవి కలాష్ పాత్రలో నటించిన వినీత్ కుమార్ గురించి ఆరా తీస్తే అతొనొక మెడికల్ కాలేజ్ టాపర్ ఇంకా ఆయుర్వేదిక్ సర్జన్ అని తెలుస్తుంది. వారణాసిలో జన్మించిన వినీత్ కుమార్ సింగ్ ఫాదర్ ఒక మ్యాథెమిక్ సైంటిస్ట్.. అందుకే చదువుల్లో వినీత్ కూడా క్లవర్ అని తెలుస్తుంది. చదువులోనే కాదు వినీత్ బాస్కెట్ బాల్ లో కూడా జాతీయ స్థాయిలో ఆడినట్టు తెలుస్తుంది. అంతేకాదు కంబైండ్ ప్రీ మెడికల్ టెస్ట్ లో క్వాలిఫై అయ్యి మెడికల్ కాలేజ్ టాపర్ గా కూడా నిలిచాడు వినీత్ కుమార్.
ఆ తర్వాత ఆర్.ఏ పొద్దార్ ఆయుర్వేద మెడికల్ కాలేజ్ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేద మెడిసిన్ అండ్ సర్జరీ కూడా పూర్తి చేశాడట వినీత్ కుమార్. ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ నాగ్ పూర్ లో కొన్నాళ్లు ఎండీగా పనిచేశారు. సినిమాల మీద ఆసక్తితో 2002 లోనే ప్రయత్నాలు మొదలు పెట్టగా సంజయ్ దత్ పిత లో ఛాన్స్ అందుకున్నాడు. అప్పటి నుంచి వరుస సినిమాలు చేస్తున్న వినీత్ కు చావా సినిమాతో మంచి క్రేజ్ ఏర్పడింది.
చావా సినిమా గురించి తన అనుభవాలను రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పిన వినీత్ కుమార్ డైరెక్టర్ చావా క్లైమాక్స్ సీన్ చెప్పినప్పుడే అద్భుతంగా అనిపించిందని అన్నారు. ఐతే చెప్పినట్టుగా తెర మీద అది వర్క్ అవుట్ అవుతుందని అనుకోలేదు కానీ సినిమా చూస్తే అద్భుతం కాక మరేమనాలి అనిపించేసిందని అన్నారు వినీత్ కుమార్ సింగ్. ఎన్నేళ్ల నుంచి సినిమాలు చేస్తున్నాం అన్నది కాదు ఏ పాత్రతో ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యామన్నది ఇంపార్టెంట్. అలా నటుడిగా తను ఎన్నో సినిమాలు చేసినా చావా లో కవి కలాష్ పాత్ర తనకు ప్రత్యే గుర్తింపు తెచ్చిందని చెబుతున్నారు వినీత్ కుమార్.