Begin typing your search above and press return to search.

అవ‌మానాల‌పై ద‌ర్శ‌న్ కుమారుడి ఆవేద‌న‌

అభిమాని హ‌త్యోదంతంలో అరెస్ట్ అయిన ద‌ర్శ‌న్ ని నెటిజ‌నులు త‌మ వ్యాఖ్య‌ల‌తో తూల‌నాడుతున్నారు.

By:  Tupaki Desk   |   16 Jun 2024 1:30 AM GMT
అవ‌మానాల‌పై ద‌ర్శ‌న్ కుమారుడి ఆవేద‌న‌
X

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో తన తండ్రిపై ప్రతికూల వ్యాఖ్యలు చేయడం, అభ్యంతరకరమైన పదజాలం ఉపయోగించడంపై నటుడు దర్శన్ కుమారుడు 15 ఏళ్ల వినీష్ దర్శన్ ఆవేద‌న వ్య‌క్తం చేసాడు. అభిమాని అయిన రేణుకాస్వామి హత్య కేసులో 'చాలెంజింగ్ స్టార్' దర్శన్, అతడి సన్నిహిత నిందితులు 12 మందిని అరెస్టు చేశారు.

అభిమాని హ‌త్యోదంతంలో అరెస్ట్ అయిన ద‌ర్శ‌న్ ని నెటిజ‌నులు త‌మ వ్యాఖ్య‌ల‌తో తూల‌నాడుతున్నారు. ఇది ద‌ర్శ‌న్ మైన‌ర్ కుమారుడి హృద‌యాన్ని తీవ్రంగా గాయ‌ప‌రుస్తోంది. 70,400 మంది ఫాలోవర్లతో తన తండ్రికి అంకితమైన ఫ్యాన్ పేజీ సహా పలు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను నిర్వహిస్తున్న వినీష్ తాజా పోస్ట్ ద్వారా తన మనోభావాలను వ్యక్తం చేశాడు. ''నా తండ్రిని బాధపెట్టే వ్యాఖ్యలు.. అభ్యంతరకరమైన పదజాలం ఉప‌యోగించినందుకు ధన్యవాదాలు. దయచేసి గుర్తుంచుకోండి.. నేను భావోద్వేగాలతో 15 ఏళ్ల వయస్సులో ఉన్నాను. ఈ కష్ట సమయంలో నా తల్లిదండ్రులకు మద్దతు అవసరమైనప్పుడు.. నాపై అవమానక‌ర వ్యాఖ్య‌లు విసరడం వల్ల ఏమీ మారదు''అని ఇన్‌స్టా పోస్ట్‌లో ఆవేద‌న వ్య‌క్తం చేసాడు.

దర్శన్ అతని భాగస్వామి పవిత్ర గౌడ స‌హా మరో 12 మంది ప్రస్తుతం జూన్ 17 వరకు పోలీసు కస్టడీలో ఉన్నారు. చిత్రదుర్గ నివాసి రేణుకాస్వామి.. ప‌విత్ర గౌడ‌కు వ్య‌తిరేకిగా ఉన్నారు. దర్శన్ అతడి భార్య మధ్య విభేదాలకు కారణమైందని ఆరోపిస్తూ నటి కం మోడల్ పవిత్ర గౌడపై సోషల్ మీడియాలో అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. త‌న‌ని అవ‌మానించిన అభిమానిపైకి ప‌విత్ర ద‌ర్శ‌న్ ని ఉసిగొల్పింది. దీనివ‌ల్ల‌నే ఈ హ‌త్య జ‌రిగింది. ఈ కేసుకు సంబంధించి దర్శన్ సన్నిహితుడు సహా ముగ్గురు వ్యక్తులను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. అధికారులు స్వాధీనం చేసుకున్న సీసీటీవీ ఫుటేజీలో బాధితుడిని కారులో కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది.

చిత్రదుర్గలోని దర్శన్ అభిమాన సంఘం సభ్యుడు రాఘవేంద్ర (33) దర్శన్‌ను కలుద్దామ‌నే నెపంతో రేణుకాస్వామిని ఆర్‌ఆర్‌నగర్‌లోని ఓ షెడ్డుకు రప్పించినట్లు సమాచారం. అక్కడే అకారణంగా చిత్రహింసలు పెట్టి చంపేశారు. బాధితుడి మృతదేహం వీధికుక్క‌లు ఈడ్చుకెళ్లి పీక్కు తిన్న క్ర‌మంలో దానిని వాచ్ మ‌న్, ఫుడ్ డెలివ‌రీ బాయ్ చూసి పోలీసుల‌కు ఫిర్యాదు చేసారు. జూన్ 9న సుమనహళ్లిలోని ఓ అపార్ట్‌మెంట్‌కు ఆనుకుని ఉన్న మురుగునీటి కాలువ దగ్గర మృత‌దేహం కుళ్లిన స్థితిలో కనిపించింది. ఆ త‌ర్వాత క‌థ అంతా తెలిసిందే.