Begin typing your search above and press return to search.

80ల‌లో ఆసియాలోనే అత్య‌ధిక పారితోషికం అందుకున్న హీరో?

2024 లేదా 2000లో అత్య‌ధిక పారితోషికం అందుకున్న న‌టుడి గురించి సులువుగా గూగుల్ సెర్చ్ లో క‌నిపెట్టి చెప్పేయ‌గ‌లం.

By:  Tupaki Desk   |   5 Aug 2024 3:58 AM GMT
80ల‌లో ఆసియాలోనే అత్య‌ధిక పారితోషికం అందుకున్న హీరో?
X

2024 లేదా 2000లో అత్య‌ధిక పారితోషికం అందుకున్న న‌టుడి గురించి సులువుగా గూగుల్ సెర్చ్ లో క‌నిపెట్టి చెప్పేయ‌గ‌లం. కానీ 80ల‌లో అత్య‌ధిక పారితోషికం అందుకున్న భార‌తీయ న‌టుడు ఎవ‌రు? అంటే వెంట‌నే చెప్ప‌డం క‌ష్టం. చాలా ప‌రిశోధించాకే ఫ‌లానా హీరో అని చెప్ప‌గ‌లం.

ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం.. ది గ్రేట్ వినోద్ ఖ‌న్నా. 80ల‌లో భార‌తీయ సినీప‌రిశ్ర‌మ‌ను ఏలిన హీరోల్లో ముఖ్యుడు వినోద్ ఖ‌న్నా. అత‌డు అప్ప‌టి అగ్ర క‌థానాయిక శ్రీ‌దేవి స‌ర‌స‌న న‌టించారు. శ్రీదేవి కెరీర్ 1980 నుంచి 2000 వ‌ర‌కూ అజేయంగా సాగింది. శ్రీ‌దేవితో క‌లిసి న‌టించిన ఒక ప్ర‌ముఖ హిందీ హీరో ఆసియాలోనే అత్య‌ధిక పారితోషికం అందుకున్న హీరోగా రికార్డుల్లో నిలిచారు. అత‌డు వినోద్ ఖ‌న్నా అనే చ‌ర్చ అప్ప‌ట్లో సాగింది.

తాజాగా శ్రీ‌దేవితో పాటు ఇద్ద‌రు న‌టులు ఉన్న ఫోటో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. శ్రీ‌దేవితో పాటు ఉన్న హీరోల్లో వినోద్ ఖ‌న్నా ఒక‌రు. అమితాబ్ బచ్చన్ - రాజేష్ ఖన్నాలతో పాటు అతడి కాలంలో అత్యధిక పారితోషికం పొందిన స్టార్లలో ఒకరైన వినోద్ ఖన్నా 2017లో మరణించారు. 1970ల చివరి నుండి 1980ల ప్రారంభంలో అమితాబ్ బచ్చన్ తో పోటీ పడగల ఏకైక సూపర్ స్టార్ గా వినోద్ ఖ‌న్నా వెలుగొందారు. సినిమాల నుండి విరామం తీసుకునే ముందు అతడు ఫ్యాషన్ ఐక‌న్‌గా వెలిగిపోయారు.