టాలీవుడ్ లో వాళ్లకు యమా గిరాకీ!
టాలీవుడ్ లో గాయనీ, గాయకులకు కొదవలేదు. హైదరాబాద్ లోనే ఎంతో గొప్ప సింగర్లున్నారని థమన్ అన్నారు.
By: Tupaki Desk | 24 Dec 2024 12:30 PM GMTటాలీవుడ్ లో గాయనీ, గాయకులకు కొదవలేదు. హైదరాబాద్ లోనే ఎంతో గొప్ప సింగర్లున్నారని థమన్ అన్నారు. వాళ్ల ట్యాలెంట్ ను వాడుకుంటే గొప్ప ఔట్ పుట్ తేవొచ్చు అంటున్నారు. అవకాశాలివ్వగలిగితే ప్రూవ్ చేసుకుంటారని అన్నారు. అయితే ఓ సినిమాకి సంబంధించిన సంగీతాన్ని పూర్తి చేయాలంటే మాత్రం హైదరాబాద్ లో సాధ్యం కాలేదంటున్నారాయన. మ్యూజిక్ స్టూడియోలు ఉన్నప్పటికీ అవి పూర్తి స్థాయిలో అందుబాటులోకి లేకపోవడంతో చెన్నై, ముంబై వెళ్లాల్సి వస్తుందన్నారు.
అక్కడ ఉన్నంత టెక్నాలజీ హైదరాబాద్ లో లేదు. ఎలాంటి టెక్నాలజీ అయినా అందుబాటులో ఉందని.. సంగీతానికి సంబంధించి అంతా హైదరాబాద్ లో ఉండి పూర్తి చేసినా క్లైమాక్స్ కి వచ్చే సరికి చెన్నై వెళ్లాల్సి వస్తుందన్నారు. అలాగే సంగీతానికి సంబంధించి తెలుగులో గిటారిస్టులు..వయోలీన్ ప్లేయర్లు కూడా హైదరాబాద్ లో దొరకడం లేదన్నారు. వాళ్ల కోసం ఇతర రాష్ట్రాలు, అవసరమైతే దేశాలు కూడా దాటాల్సి వస్తుందన్నారు.
ఓ సినిమాకి సంబంధించి సంగీతం పనులు ప్రారంభిస్తే? వాళ్లను స్పెషల్ ప్లైట్లు వేసి తీసుకురావాల్సి వస్తుంద న్నారు. వాళ్లు తీసుకునే పారితోషికం కూడా భారీగానే ఉంటుదన్నారు. హైదరాబాద్ లో ఉండి మ్యూజిక్ పనులు మొదలు పెడితే? ప్రధానంగా ఎదురయ్యే సమస్య ఇదని థమన్ అంటున్నారు. స్కిల్, ఫ్యాషన్ ఉండి గిటార్, వయోలిన్ నేర్చుకుంటూ మంచి భవిష్యత్ ఉంటుందన్నారు.
వాటిని నేర్చుకోవడానికి ముందుకొచ్చే వారు చాలా తక్కువ మందే కనిపిస్తున్నారన్నారు. ప్రస్తుతం థమన్ స్టార్ హీరోల సినిమాలకు సంగీతం అందిస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. గ్రేట్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తోన్న `గేమ్ ఛేంజర్ `చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇంకా కొన్ని సినిమాలు సెట్స్ లో ఉన్నాయి.