Begin typing your search above and press return to search.

భార్య ముందు ప‌రువు పోయింది.. న‌టుడి ఆవేద‌న‌!

ఇప్పుడు పెద్ద హీరో సినిమాలో న‌టించిన ఒక చిన్న హీరో కంప్లైంట్ నిజంగా హృద‌యవిదార‌కంగా ఉంది.

By:  Tupaki Desk   |   14 Sep 2024 2:45 AM GMT
భార్య ముందు ప‌రువు పోయింది.. న‌టుడి ఆవేద‌న‌!
X

పెద్ద స్టార్లు నటించే సినిమాల్లో చిన్న న‌టుల‌కు అంత‌గా స్కోప్ ఉండ‌దు. పెద్ద అవ‌కాశం ద‌క్కింద‌ని సంతోషించేలోగానే, తెర‌పై త‌మ‌ను వెతుక్కునేప్ప‌టికి అదంతా ఆవిరి అయిపోతుంది. ఇప్పుడు పెద్ద హీరో సినిమాలో న‌టించిన ఒక చిన్న హీరో కంప్లైంట్ నిజంగా హృద‌యవిదార‌కంగా ఉంది. వివ‌రాల్లోకి వెళితే ...

'గోవింద నామ్ మేరా'లో విక్కీ కౌశల్‌తో కలిసి తన నటనా రంగ ప్రవేశం చేసిన 'కంటెంట్ సృష్టికర్త' విరాజ్ ఘేలానీ పెద్ద తెర‌పై పెద్ద అవ‌కాశం అందుకున్నాడు. షారుఖ్ ఖాన్ 'జవాన్‌'లో విరాజ్ అతిధి పాత్రలో నటించాడు. అయితే ఇటీవలి ఇంటర్వ్యూలో విరాజ్ తాను అట్లీ దర్శకత్వంలో పని చేయడం 'చెత్త అనుభవం' అని చెప్పాడు.

నేను ఎందుకు చేసాను? అంటూ అత‌డు త‌న‌ను తాను ప్ర‌శ్నించుకున్నాడు. నా కోసం సినిమా చూసినవారు నాపై జాలి ప‌డ్డారు. చాలా దయతో ఉన్నారు.. కానీ అది నాకు ఎదురైన చెత్త అనుభవం.. అని ఆవేద‌న వ్య‌క్తం చేసాడు. షారూఖ్ ఖాన్ , సంజయ్ దత్ ఉన్నందున మేక‌ర్స్ మ‌మ్మల్ని పరిగణించరు.. అని అన్నాడు. ది హేవింగ్ సేడ్ దట్ షో పోడ్‌కాస్ట్‌లో విరాజ్ ఈ విష‌యాల‌ను చెప్పాడు.

కంటెంట్ సృష్టికర్త విరాజ్ తన సన్నిహితులు జవాన్‌ను థియేటర్లలో లేదా OTTలో కూడా చూడలేదని అన్నాడు. చూసిన వారు చెత్త‌గా ఉంద‌ని అన్నార‌ని తెలిపాడు. విరాజ్ తన కాబోయే భార్యను సినిమా ప్రీమియర్‌కి తీసుకెళ్లినప్పుడు అతడి సన్నివేశం కోసం ఆత్రుతగా ఎదురుచూసిందని.. కానీ నేను వచ్చి కేవలం సెకన్లలో వెళ్లాను.. నేను అస్పష్టమైన నేపథ్యంలా ఉన్నాను అంతే! అని అన్నాడు. జవాన్‌లో సరైన డైలాగ్ ఉంటుంద‌ని తాను ఆశించిన‌ట్లు విరాజ్ పేర్కొన్నాడు. నేను మే ఎండ‌ల్లో ఐలాండ్‌లో మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు 10 రోజులు షూట్ చేసాను. 15 రోజుల ఫుటేజ్ ఉన్నప్పటికీ, వారు మొదటి రోజు అరగంట షూటింగ్ ఫుటేజీని మాత్రమే ఉపయోగించారు. వారు క్రియేటర్‌లను, ఇన్‌ఫ్లుయెన్సర్‌లను కేవలం పలుకుబడి కోసం ప్రదర్శించారు..అని తెలిపాడు.

సెప్టెంబర్ 2023లో విడుదలైన జవాన్‌లో యాక్షన్ ప్యాక్డ్ అవతార్‌తో కింగ్ ఖాన్ మరోసారి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అట్లీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నయనతార, విజయ్ సేతుపతి, సన్యా మల్హోత్రా కీలక పాత్రల్లో నటించారు. త‌దుప‌రి షారూఖ్‌ కింగ్‌లో కనిపించనున్నారు. ఇందులో అత‌డి కుమార్తె సుహానా ఖాన్, ముంజ్యా స్టార్ అభయ్ వర్మ కూడా నటించనున్నారు. లోకర్నో ఫిల్మ్ ఫెస్టివల్‌లో, షారుఖ్ ఖాన్ కూడా మొదటిసారిగా కింగ్ గురించి వెల్ల‌డించారు. ఇది యాక్షన్ డ్రామా.. ఇది హిందీ సినిమా.. ఆసక్తికరంగా ఉంటుంది. నేను కొంతకాలంగా అంటే, ఏడెనిమిదేళ్లుగా ఇలాంటి సినిమా చేయాలనుకుంటున్నాను. సుజోయ్ సరైన ఎంపిక అని మేము భావించాం. ఎందుకంటే ఇది చాలా ఎమోషనల్‌గా కరెక్ట్‌గా ఉండాలని మేము కోరుకుంటున్నాం. కూల్, మాస్, యాక్షన్, ఎమోషనల్ సినిమా చేయడానికి అందరం కలిసి ప్ర‌య‌త్నిస్తున్నాం అని తెలిపారు.