Begin typing your search above and press return to search.

పిల్ల‌ల కోసం వంట మాష్ట‌ర్లు అయిన ఆ ఇద్ద‌రు!

విరాట్ కొహ్లీ- అనుష్క శ‌ర్మ నిత్యం ఎంత బిజీగా ఉంటారో చెప్పాల్సిన ప‌నిలేదు.

By:  Tupaki Desk   |   6 Sep 2024 7:32 AM GMT
పిల్ల‌ల కోసం వంట మాష్ట‌ర్లు అయిన ఆ ఇద్ద‌రు!
X

విరాట్ కొహ్లీ- అనుష్క శ‌ర్మ నిత్యం ఎంత బిజీగా ఉంటారో చెప్పాల్సిన ప‌నిలేదు. ఇరువురికి త‌మ వ్య‌క్తిగ‌త ప‌నుల‌కే స‌మ‌యం కేటాయించ‌లేని ప‌రిస్థితి. ఉద‌యం లేచిన ద‌గ్గ‌ర నుంచి రాత్రి ప‌డుకునే వ‌ర‌కూ ర‌క‌ర‌కాల వ్యాప‌కాల్లో బిజీగా ఉంటారు. పిల్ల‌లున్నా ఇంట్లో కేర్ టేక‌ర్లు ఉంటారు కాబ‌ట్టి వాళ్లు చూసు కుంటారు. విరాట్ డే ఉద‌యం గ్రౌండ్ లో మొద‌ల‌వుతుంది. ఆ త‌ర్వాత జిమ్ కి కొంత స‌మ‌యం కేటాయి స్తాడు.

అటుపై బిజినెస్ వ్య‌వ‌హారాల్లో ప‌డిపోతాడు. ఒక‌వేళ మ్యాచులుంటే మాత్ర వాట‌న్నింటికి వ‌దుల‌కోవాల్సిందే. స్వ‌దేశంలో మ్యాచులైతే ప‌ర్వాలేదు..ఇత‌ర దేశాల టూర్లు అయితే మ‌రింత బిజీగా ఉంటాడు. ఇక అనుష్క కూడా అంతే బిజీగా ఉంటుంది. న‌టిగా, నిర్మాత‌గా, వ్యాపార‌వేత్త‌గా రెండు రంగాల్లోనూ నిత్యం బిజీ. కొన్ని నెల‌లుగా కొత్త వ్యాపార‌ల్లోనూ భాగ‌స్వామిగా మారే ప్ర‌య‌త్నాలు చేస్తోంది.

మ‌రి ఇలా ఇంత బిజీగా ఉన్న జోడీగా పిల్ల‌ల‌కు స‌మ‌యం కేటాయించే స‌మ‌యం ఉంటుందా? అందులోనూ వంట‌గ‌దిలో వండే స‌మ‌యం అంత‌క‌న్నా ఉంటుందా? అంటే చ‌స్తే ఉండ‌దంటారు. కానీ బార్య భ‌ర్త‌లిద్ద‌రు ఎంత బిజీగా ఉన్న పిల్ల‌ల కోసం మాత్రం వంట మాష్ట‌ర్లగా మారిపోయిన సంగ‌తి ఆల స్యంగా వెలుగులోకి వచ్చింది. వారిద్ద‌రి షెడ్యూల్ ఎంత బిజీగా ఉన్నా పిల్ల‌ల కోసం మాత్రం స్వ‌యంగా వండుతారుట‌.

పిల్ల‌లిద్ద‌ర్నీ ఎంతో క్ర‌మ శిక్ష‌ణ‌తో పెంచుతున్నట్లు తెలిపారు. స‌మ‌యానికి తిన‌డం...స‌మ‌యానికి నిద్ర‌పోవ‌డం వంటివి ఇప్ప‌టి నుంచే బాగా ఆల‌వాటు చేయాల్సిన ప‌నులుగా చెప్పారు. పిల్ల‌ల ఆరోగ్యం కోసం త‌ప్పకుండా వంట సంగ‌తి వాళ్లిద్ద‌రే చూసుకుంటారు. ఇంట్లో ప‌నిమ‌నుషులు ఎంత మంది ఉన్నా? పిల్ల‌ల‌కు వండి పెట్ట‌డంతో ఆ తృప్తి ఎంతో గొప్ప‌గా ఉంటుంద‌ని అనుష్క తెలిపింది.