Begin typing your search above and press return to search.

ఈసారి బర్త్‌ డే చాలా స్పెషల్‌

తాజాగా విరాట్ తన 36వ పుట్టిన రోజును జరుపుకున్న విషయం తెల్సిందే.

By:  Tupaki Desk   |   8 Nov 2024 6:09 AM GMT
ఈసారి  బర్త్‌ డే చాలా స్పెషల్‌
X

టీం ఇండియా స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లీ ఆటతో ఎంత బిజీగా ఉన్నా తన కుటుంబం కోసం సాధ్యం అయినంత ఎక్కువ సమయం కేటాయించడం మనం చూస్తూనే ఉంటాం. తన ఇద్దరు పిల్లలతో సమయం ఎక్కువ గడపడం కోసం ఆయన ఇష్టపడుతూ ఉంటారు. అనుష్క శర్మ ను ప్రేమ వివాహం చేసుకున్న విరాట్‌ కోహ్లీ ఇద్దరు పిల్లలకు తండ్రి అయిన విషయం తెల్సిందే. క్రికెట్‌తో ఎంత బిజీగా ఉన్నా ముఖ్యమైన రోజుల్లో ఫ్యామిలీతో ఉండటం, వారితో సెలబ్రేట్‌ చేసుకోవడంను విరాట్‌ కోహ్లీ ఇష్టపడుతాడు అనడంలో సందేహం లేదు. తాజాగా విరాట్ తన 36వ పుట్టిన రోజును జరుపుకున్న విషయం తెల్సిందే.


నవంబర్‌ 5న ఎప్పటిలాగే ఫ్యామిలీతో బర్త్‌ డే వేడుక జరుపుకున్నారు. ఒక వైపు టీం ఇండియాతో కలిసి క్రికెట్‌ ఆడుతూనే మరో వైపు బర్త్‌ డే వేడుకల కోసం ఫ్యామిలీకి కోహ్లీ సమయం ఇవ్వడం జరిగింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో విరాట్‌ కోహ్లీ మాట్లాడుతూ ఈసారి తన బర్త్‌ డే అనుష్కతో పాటు ఇద్దరు పిల్లలతో చాలా సందడిగా, ఆసక్తికరంగా సాగింది. ఈసారి జరిగిన పుట్టిన రోజు వేడుక చాలా స్పెషల్‌ అన్నట్లు కోహ్లీ వ్యాఖ్యలు చేశారు. ఈసారి తన పాప కోసం బర్త్‌డే అన్నట్లుగా విరాట్‌ పేర్కొన్నారు. ప్రతిసారి విరాట్‌ బర్త్‌డే సందర్భంగా సోషల్‌ మీడియాలో అభిమానులు చేసే సందడి అంతా ఇంతా కాదు. మరోసారి సోషల్‌ మీడియాలో కోహ్లీ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్‌ అయింది.

ప్రతి సంవత్సరం మాదిరిగా కాకుండా ఈసారి బర్త్‌ డే ఉందంటూ విరాట్‌ కోహ్లీ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్స్‌ రకరకాలుగా స్పందిస్తూ ఉన్నారు. వామిక, అకాయ్‌ లతో బర్త్‌ డే జరుపుకోవడం వల్లే కోహ్లీ స్పెషల్‌ గా ఫీల్‌ అవుతున్నాడని కొందరు కామెంట్స్ చేస్తే, మరి కొందరు కోహ్లీ పెద్దవాడు అయ్యాడు కనుక స్పెషల్‌గానే అనిపిస్తుందని మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి కోహ్లీ బర్త్‌ డే కి సంబంధించిన హడావుడి, సోషల్‌ మీడియా ట్రెండ్‌ కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ సమయంలో కోహ్లీ ఫోటోలు వీడియోలో తెగ సోషల్‌ మీడియాలో షేర్‌ అవుతున్నాయి.

కోహ్లీ బర్త్‌ డే సందర్భంగా కోహ్లీ తన ఇద్దరు పిల్లలు వామిక, అకాయ్ లను ఎత్తుకుని ఉన్న ఫోటో ను అనుష్క శర్మ షేర్‌ చేయడం జరిగింది. ఆ ఫోటోలో ఎప్పటిలాగే అకాయ్‌, వామికల ఫేస్‌ లను ఈమోజీలతో కవర్‌ చేయడం జరిగింది. ఇప్పటివరకు అనుష్క, కోహ్లీ దంపతులు తమ ఇద్దరు పిల్లల ఫేస్ లను రివీల్‌ చేయలేదు. కానీ సోషల్‌ మీడియాలో కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి. అధికారికంగా మాత్రం వీరు తమ పిల్లల ఫోటోలను ఎప్పుడు షేర్‌ చేస్తారా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వారి వ్యక్తిగత జీవితాలకు భంగం కలిగించకూడదు అనే ఉద్దేశ్యంతోనే విరాట్‌ కోహ్లీ దంపతులు ఇలా చేస్తూ ఉంటారనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు.