విరాట్ ని ఇలా డైలమాలో పడేస్తే ఎలా అనుష్క!
ఇంతకీ అనుష్క ఏమందంటే? కొన్ని సంవత్సరాల క్రితం కొన్ని రకాల పరిస్థితులకు చాలా వేగంగా స్పందించేదిట
By: Tupaki Desk | 17 Aug 2023 1:30 PM GMTఅనుష్క శర్మ-విరాట్ కోహ్లీ దంపతుల గురించి చెప్పాల్సిన పనిలేదు. వృత్తి పరంగా ఎంతబిజీగా ఉన్నా ఫ్యామిలీ లైఫ్ కేటాయించాల్సిన సమయాన్ని కేటాయిస్తారు. వామిక పుట్టిన తర్వాత ఆ బాండింగ్ మరింత స్ట్రాంగ్ అయింది. అనుష్క సినిమాలకంటే ఎక్కువగా నిర్మాణంపై దృష్టి పెడుతుంది. ఓటీటీలోనూ పెట్టుబడుల తో సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్తుంది. ఇక జోడీ పెళ్లైనా జంటగా ఇంటర్వ్యూలు ఇవ్వడంలో మాత్రం వేగం ఇప్పటికీ తగ్గలేదు.
దంపతులిద్దరు రకరకాల మీడియా సంస్థల్లో ప్రత్యక్షమవుతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకి హాజరైన విరుష్క జోడీ...అందులో జీవితం గురించి ఎదురైన కొన్ని ప్రశ్నలకు అనుష్క సమాధానం చెబుతుంటే? విరాట్ కొహ్లీకి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఆమె ఏం చెబుతుందో అర్దం కాక..తనతో పెళ్లైన తర్వాత ఇలా మారిపోయిందా? లేక మొదటి నుంచే ఇలాగే ఉందా? అన్న ఓ డౌట్ విరాట్ మైండ్ లో రెయిజ్ అయింది.
ఇంతకీ అనుష్క ఏమందంటే? కొన్ని సంవత్సరాల క్రితం కొన్ని రకాల పరిస్థితులకు చాలా వేగంగా స్పందించేదిట. అలా స్పందించిన వాటి నుంచి కొన్నాళ్ల తర్వాత చాలా విషయాలు గ్రహించిందిట. అవి తన జీవితంలో చాలా రకాల మార్పులు తీసుకొచ్చాయట. జీవితం సంతోషంగా ఉండాలంటే? రియాక్ట్ కాకుండా ఉండటమే మంచిదని బధులిచ్చింది. ఆ వెంటనే విరాట్ వైపు చూస్తూ అండ్ యూ అంటుంది. అప్పటికే విరాట్ కి అమె ఏం చెప్పిందో? ఎవర్ని దృష్టిలో పెట్టుకుని అలా మాట్లాడిందో అర్దం కాక ఓ డైలమాలో ఉన్నాడు.
పక్కనే ఇంటర్వ్యూయర్ బిగ్గరగా నవ్వడంతో విరాట్ కూడా వెంటనే నవ్వు అందుకున్నాడు. మరి అనుష్క ఇలా మారిపోవడం అన్నది విరాట్ తో పెళ్లికి ముందా? లేక పెళ్లి తర్వాత అని తేలాల్సిన అంశం. ఎందుకంటే? విరాట్ సిక్స్త్ సెన్స్ లో ఎక్కడో? ఏదో తేడా కొడుతున్నట్లు ఓ ఎక్స్ ప్రెషన్ ఇచ్చాడు.