Begin typing your search above and press return to search.

కోహ్లీ ఆ ఛాన్స్ ఇస్తాడా? త‌నే తీసుకుంటాడా?

50 సెంచ‌రీల‌తో క్రికెట్ గాడ్ స‌చిన్ టెండూల్కర్ రికార్డు బ‌ద్ద‌ల కొట్ట‌డంతో విరాట్ కోహ్లీ పేరు క్రికెట్ చ‌రిత్ర‌లో నిలిచిపోయింది

By:  Tupaki Desk   |   16 Nov 2023 7:41 AM GMT
కోహ్లీ ఆ ఛాన్స్ ఇస్తాడా? త‌నే తీసుకుంటాడా?
X

50 సెంచ‌రీల‌తో క్రికెట్ గాడ్ స‌చిన్ టెండూల్కర్ రికార్డు బ‌ద్ద‌ల కొట్ట‌డంతో విరాట్ కోహ్లీ పేరు క్రికెట్ చ‌రిత్ర‌లో నిలిచిపోయింది. ఆ రికార్డు అధిగ‌మించ‌డం అన్న‌ది ఇప్ప‌ట్లో ఏ క్రికెటర్ కి సాధ్యం కాని ప‌ని. స‌చిన్..ధోనీ ని మించిన పాపులర్ క్రికెట‌ర్ గా అవ‌త‌రించాడు. ఇలాంటి స‌మ‌యంలో విరాట్ కోహ్లీ బ‌యోపిక్ అంశం మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చింది. ఇండియా- న్యూజిలాండ్ ని మ‌ట్టిక‌రిపించి ఫైన‌ల్ కి దూసుకెళ్లిన సంద‌ర్భంగా! కోహ్లీ కాక నెట్టింట మాములుగా లేదు.

నిన్న‌టి మ్యాచ్ కి చాలా మంది బాలీవుడ్ సెల‌బ్రిటీలు విచ్చేసారు. అందులో రాక్ స్టార్ ర‌ణ‌బీర్ క‌పూర్ కూడా ఉన్నారు. 'యానిమ‌ల్' ప్ర‌మోష‌న్ లో భాగంగా వ‌చ్చిన ర‌ణ‌బీర్ కోహ్లీ బ‌యోపిక్ గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసాడు. విరాట్ జీవిత క‌థ‌లో మీరు న‌టించాలి? అనుకుంటున్నారా? అంటే ర‌ణ‌బీర్ ఆస‌క్తిక‌ర స‌మాధానం ఇచ్చాడు. 'విరాట్ జీవితాన్ని సినిమాగా తీస్తే అందులో అత‌డే న‌టించాలి.

ఎందుకంటే న‌టుల కంటే అందంగా ఉంటాడు. మంచి ఫిట్ గానూ క‌నిపిస్తాడు. అందుకే ఆ పాత్ర‌ను అత‌నే పోషించాలి' అని అన్నారు. ప్ర‌స్తుతం ఈ వ్యాఖ్య‌లు నెట్టింట వైర‌ల్ గా మారాయి. సాధార‌ణంగా ఇలాంటి ప్ర‌శ్న వెళ్తే...త‌ప్ప‌కుండా అనే బ‌ధులొస్తుంది. కానీ ర‌ణ‌బీర్ మాత్రం అందుకు భిన్నంగా స్పందించాడు. అయితే విరాట్ బ‌యోపిక్ లో న‌టించ‌డానికి టాలీవుడ్ నుంచి మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ మాత్రం ముందున్నాడు.

కొహ్లీ త‌న‌కెంతో ఇష్ట‌మైన క్రికెట‌ర్ అని.. అత‌డు ఎంతో మందికి స్పూర్తి అంటూ.. అలాంటి అవ‌కాశం త‌నకి వ‌స్తే మిస్ చేసుకోను అని అన్నాడు. బ్యాటింగ్ మ్యాస్ట్రో బ‌యోపిక్ పై ఇలాంటి ప్ర‌చారం కొత్తేం కాదు. అత‌డు క్రికెట్ లో ఉన్న‌త శిఖ‌రాన్ని అధిరోహించిన నాటి నుంచి జాతీయ మీడియాలో ఎప్ప‌టిక‌ప్పుడు వార్త‌లు వ‌స్తునే ఉన్నాయి. ఇప్ప‌టికే స‌చిన్..ధోని..క‌పిల్ దేవ్ స‌హా ప‌లువురు క్రికెట‌ర్ల జీవిత క‌థ‌లు వెండి తెర‌కెక్కిన సంగ‌తి తెలిసిందే. మ‌రి కోహ్లీ ఆఛాన్స్ తీసుకుంటాడా? ఇంకెవ‌రికైనా ఇస్తాడా? అన్న‌ది చూడాలి. కానీ అత‌డి బ‌యోపిక్ మాత్రం త‌ధ్యం.