Begin typing your search above and press return to search.

రిలాక్స్‌డ్‌గా అనుష్క‌తో డిన్న‌ర్ డేట్..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్ 2024) గత వారం ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీకి ఎట్టకేలకు కొంత సమయం దొరికింది.

By:  Tupaki Desk   |   29 May 2024 9:38 AM GMT
రిలాక్స్‌డ్‌గా అనుష్క‌తో డిన్న‌ర్ డేట్..!
X

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్ 2024) గత వారం ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీకి ఎట్టకేలకు కొంత సమయం దొరికింది. అతడు ముంబైకి తిరిగి వచ్చాడు. భార్య అనుష్క శర్మతో పాటు సహచర క్రికెటర్ జహీర్ ఖాన్ అత‌డి భార్య సాగరిక ఘట్గే .. క్రికెట్ ప్రెజెంటర్ గౌరవ్ కపూర్ స‌హా స్నేహితులతో కలిసి డిన్నర్ డేట్‌ను ఆస్వాధించాడు. ఈ డిన్నర్ డేట్‌కి సంబంధించిన అనేక ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.


ఒక వీడియోలో అనుష్క త‌న‌ స్నేహితులతో క‌లిసి న‌చ్చిన శైలిలో ఆస్వాధిస్తూ క‌నిపించారు. అనుష్క‌ కెమెరా ముందు న‌వ్వుతూ క‌నిపించింది. తెల్లటి టాప్ లేయర్డ్‌తో మ్యాచింగ్ షర్ట్ ఫేడెడ్ బ్లూ డెనిమ్‌లతో ధరించిన అనుష్క మ‌నోహ‌రంగా క‌నిపించింది. మరోవైపు విరాట్ గ్రే ప్యాంట్ - బ్లాక్ షర్ట్ లో స్మార్ట్ గా క‌నిపించాడు. మరో వైరల్ ఫోటోలో విరాట్ - అనుష్క రెస్టారెంట్ సిబ్బందితో పోజులిచ్చారు. విరాట్ త‌దుప‌రి T20 ప్రపంచ కప్ కోసం US వెళ్లడానికి కొద్ది రోజుల ముందు ఈ వేడుక వైభ‌వంగా జరిగింది.


ఈ నెల ప్రారంభంలో విరాట్ కోహ్లీ త‌న భార్యామ‌ణి అనుష్క శర్మ కోసం విలాసవంతమైన పుట్టినరోజు పార్టీని నిర్వహించాడు. అనుష్క 36వ జన్మదిన వేడుక‌ల‌కు సంబంధించిన అనేక ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. విరాట్ కోహ్లీ -అనుష్క శర్మ 11 డిసెంబర్ 2017న వివాహం చేసుకున్నారు. వారు ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులు. వామిక - అకాయ్ వార‌సులు.