Begin typing your search above and press return to search.

విరాట్ కోహ్లీ నిక‌ర ఆస్తి విలువ‌?

పిచ్ వెలుపల `కింగ్ కోహ్లీ` ఇన్‌స్టాగ్రామ్‌లో 260 మిలియన్ల(26 కోట్లు)కు పైగా ఫాలోయింగ్‌ను కలిగి ఉన్నాడు.

By:  Tupaki Desk   |   9 March 2024 4:30 PM GMT
విరాట్ కోహ్లీ నిక‌ర ఆస్తి విలువ‌?
X

ప్ర‌పంచంలోనే అత్యంత ప్రభావవంతమైన క్రికెటర్లలో విరాట్ కోహ్లీ ఒకడు. అతడి ప్రభావం మైదానంలో ఎంత ఉందో, మైదానం వెలుపల కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. తన అద్భుతమైన కెరీర్ లో కోహ్లీ వన్డే ఇంటర్నేషనల్స్ (ODIలు)లో 13,800 పరుగులు.. టెస్ట్ మ్యాచ్‌లలో 8,800 పరుగులను అధిగమించాడు. పిచ్ వెలుపల `కింగ్ కోహ్లీ` ఇన్‌స్టాగ్రామ్‌లో 260 మిలియన్ల(26 కోట్లు)కు పైగా ఫాలోయింగ్‌ను కలిగి ఉన్నాడు. X (గతంలో ట్విట్టర్)లో 61.4 మిలియన్ల అనుచ‌రుల‌ను కలిగి ఉన్నాడు.

కెరీర్ జ‌ర్నీలో అసాధార‌ణ విజయాలతో కోహ్లి కొన్ని నమ్మశక్యం కాని మార్గాల్లో ఆదాయం ఆర్జిస్తున్నాడు. తద్వారా అతను ప్రపంచంలోనే అత్యధిక నిక‌ర ఆస్తులు క‌లిగి ఉన్న అథ్లెట్లలో ఒకరిగా నిలిచాడు. స్పోర్ట్స్ సూపర్‌స్టార్ కోహ్లీ ఆదాయం, పెట్టుబడులను పరిశీలిస్తే.. అత‌డి నికర ఆస్తి విలువ ఎంత అనే ప్రశ్న వ‌స్తుంది.

విరాట్ కోహ్లి నికర ఆస్తి విలువ సుమారు రూ.1,000 కోట్లు. పాపుల‌ర్ స్పోర్టికో అందించిన‌ వివ‌రాల‌ ప్రకారం 2022లో అతడి సంపాదన 33.9 మిలియన్ల డాల‌ర్లు. అంటే దీని విలువ సుమారు రూ.250 కోట్లు. అత్యధిక పారితోషికం అందుకునే భారతీయ అథ్లెట్‌గా అత‌డి పేరు మార్మోగుతోంది. ప‌లు మీడియా క‌థ‌నాల‌ ప్రకారం.. విరాట్ కోహ్లీ నికర ఆస్తుల‌ విలువ 112 మిలియన్ డాల‌ర్లు.. అంటే సుమారు రూ.950 కోట్లు.

అతడి ప్రాథమిక ఆదాయ వనరులు క్రికెట్ జీతాలు, ప్రకటనలు, సోషల్ మీడియా ఎండార్స్‌మెంట్‌లు, మార్కెటింగ్ సహకారాలు, వివిధ కంపెనీలలో పెట్టుబడులు. అయితే ఏ మార్గంలో ఎంత వ‌స్తుంది? అన్న‌ది ఆరా తీస్తే....బీసీసీఐ ప్ర‌కారం అత‌డు ఏ గ్రేడ్ ఆట‌గాడు. ఏడాదికి 7 కోట్లు అందుకుంటాడు. అద‌నంగా టెస్టులు ఆడినందుకు ఒక్కో టెస్టుకు 12ల‌క్ష‌లు, వ‌న్డేకి 6ల‌క్ష‌లు, టి 20కి 3ల‌క్ష‌లు చొప్పున అందుకుంటాడు. ఐపీఎల్ లో ఆడేందుకు ఆర్.సి.బి ఏడాదికి 15 కోట్లు చెల్లిస్తోంది.

వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల ఆదాయంలోను అత‌డు కింగ్‌. ప్ర‌ఖ్యాత కార్పొరెట్ కంపెనీలు బ్లూ ట్రైబ్, యూనివర్సల్ స్పోర్ట్స్‌బిజ్, MPL అండ్ స్పోర్ట్స్ కాన్వో వంటి స్టార్టప్‌లలో కోహ్లీకి వాటాలు ఉన్నాయి. ఈ డిజిటల్ సామ్రాజ్యం దాటి కోహ్లీకి గురుగ్రామ్‌లో సుమారు రూ.80 కోట్లు .. ముంబైలో రూ.34 కోట్ల విలువైన నివాస ఆస్తులను క‌లిగి ఉన్నాడు. అలాగే ప‌లు రియల్ ఎస్టేట్ ల‌లో ను పెట్టుబ‌డులు పెట్టాడు.

ఇండియన్ సూపర్ లీగ్ క్లబ్ FC గోవా, టెన్నిస్ క్లబ్, ప్రో-రెజ్లింగ్ టీమ్‌లో యాజమాన్య వాటాలు సహా ఇతర స్పోర్ట్స్ వెంచర్‌లలో ఆసక్తితో కోహ్లీ తన పోర్ట్‌ఫోలియోను విస్త‌రించాడు. అతడు ప్యూమాతో వన్8 అనే తన సొంత జీవనశైలి బ్రాండ్‌ను కూడా కలిగి ఉన్నాడు. స్పోర్ట్స్ స్టార్ కోహ్లీకి అనేక రెస్టారెంట్లు కూడా ఉన్నాయి. విరాట్ కోహ్లి నికర ఆస్తి విలువ అనూహ్యంగా పెర‌గ‌డంలో ఆశ్చర్యం లేదు.. ముఖ్యంగా అతడికి ఉన్న వివిధ ఆదాయ మార్గాలను పరిశీలిస్తే ఎవ‌రైనా దీనిని అంగీక‌రిస్తారు.