వీడియో: స్టార్ హీరోయిన్ సాష్టాంగ నమస్కారం
తాజాగా విరుష్క కుటుంబం ప్రముఖ ఆధ్యాత్మిక గురువు చెంత సాష్ఠాంగ నమస్కారం చేసిన వీడియో అంతర్జాలంలో వైరల్‌గా మారుతోంది.
By: Tupaki Desk | 12 Jan 2025 5:49 AM GMTISKCON సమాజ ఆధ్యాత్మిక సభ్యులుగా విరుష్క దంపతులు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న సంగతి తెలిసిందే. లార్డ్ కృష్ణ భక్తులుగా ప్రభుపాద్ మార్గనిర్ధేశనంలో ప్రయాణిస్తూ, వారి పిల్లలు ఒక సన్మార్గంలో నడుచుకోవాలని పెంపకంలో ఎంతో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భారతీయ సంస్కృతి సనాతన ధర్మాన్ని ఈ జంట గౌరవించి ప్రపంచవిఖ్యాతం చేసేందుకు చేస్తున్న ప్రయత్నం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న ఆధ్యాత్మిక గురువుల ఆశీస్సులను ఈ దంపతులు స్వీకరిస్తున్నారు.
తాజాగా విరుష్క కుటుంబం ప్రముఖ ఆధ్యాత్మిక గురువు చెంత సాష్ఠాంగ నమస్కారం చేసిన వీడియో అంతర్జాలంలో వైరల్‌గా మారుతోంది. శ్రీ ప్రేమానంద్ జీ మహారాజ్ ఆశ్రమంలో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ తమ పిల్లలు వామిక, అకాయ్ తో కలిసి కనిపించడం అభిమానులను ఆనందపరిచింది. వైరల్ వీడియోలలో పిల్లల ముఖాలు అస్పష్టంగా కనిపించగా అనుష్క శర్మ గురూజీ ప్రవచనాలను శ్రద్ధగా వినడం, సరదా సంభాషణలు కనిపిస్తున్నాయి. గురువుగారి ఆశీర్వాదంతో పాటు సలహాలను తీసుకున్నారు. క్రమశిక్షణ దైవిక ప్రేమ గురించి గురూజీ కొన్ని ప్రవచనాలను వల్లించారు. ప్రస్తుతం విరుష్క కుటుంబ ఆధ్యాత్మిక టూర్ వీడియోలు ఆన్‌లైన్‌లో వైరల్ అయ్యాయి. అయితే ఈ వీడియోలో అనుష్క శర్మ తన స్టార్ డమ్, సెలబ్రిటీ హోదాకు అతీతంగా సాష్టాంగ నమస్కారం చేయడం ఆశ్చర్యపరిచింది. విరాట్ కోహ్లీ కూడా గురూజీకి సాష్టాంగ నమస్కారం చేసారు.
ప్రేమానంద్ జీ మహారాజ్ తన బోధనలతో ఆధ్యాత్మిక మార్గ నిర్ధేశకులుగా ప్రసిద్ధి చెందారు. స్వామివారికి అనుష్క శర్మ చాలా కాలంగా శిష్యురాలు. ఆమె గతంలో గురూజీ ఆశ్రమాన్ని చాలాసార్లు సందర్శించారు. ఇటీవల భర్త కోహ్లీని కూడా తనతో పాటు తీసుకువెళుతోంది. ఈ జంట ఆధ్యాత్మిక గురువు వద్దకు చేరుకోవడం రెండవసారి. వారి మొదటి సందర్శన జనవరి 2023లో జరిగింది. తాజా విజిట్ లో స్థిరమైన అభ్యాసం, సానుకూలమైన విధి విజయాన్ని సాధించడానికి కీలకమని గురూజీ వారితో అన్నారు.
విరుష్క జంట వేసవిలో లండన్‌లో ఉన్నప్పుడు కృష్ణ దాస్ కీర్తనకు హాజరయ్యారు. కీర్తన్స్, భజన్స్ లో కనిపించడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత రెగ్యులర్ గా ఈ జంట కీర్తన్స్ లో కనిపిస్తూనే ఉన్నారు. మానసికంగా అత్యుత్తమ స్థితిని చేరుకోవడానికి మనిషికి ఉన్న ఏకైక మార్గం ఆధ్యాత్మికత. దానిని సాధించుకునేందుకే విరుష్క ప్రయత్నం. అపారమైన డబ్బు, సంపదల నిల్వలు ఇవ్వనిది ఆధ్యాత్మికత మాత్రమే ఇస్తుంది అన్న చిన్న లాజిక్ ని ఈ జంట అర్థం చేసుకుని ముందుకు సాగుతోంది. ఇది ప్రజలు, అభిమానులందరికీ స్ఫూర్తిదాయకం.