సినిమాలకు రిటైర్మెంట్ ఇచ్చేస్తాననుకుంటున్నారా! విశాల్
ఈ సందర్భంగా తన ఆరోగ్యంపై తొలిసారి స్పందించారు. 'మా నాన్న అంటే నాకెంతో ఇష్టం. ఆయన వల్లే నేనెంతో ధైర్యంగా ఉన్నాను.
By: Tupaki Desk | 12 Jan 2025 6:50 AM GMTనటుడు విశాల్ ఆరోగ్యంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగిన సంగతి తెలిసిందే. మాట్లాడుతున్నప్పుడు ఆయన ముఖం అటు ఇటూ ఉగడం..చేతులు ఒణకడం వంటి సన్నివేశాలతో విశాల్ కి ఏమైందంటూ అభిమా నులంతా ఎంతో ఆందోళన చెందారు. ఇక విశాల్ వ్యతిరేక వర్గమైతే ఆయన పనైపోయిందని...సినిమాలకు ఇక రిటైర్మెంట్ ఇవ్వడమేనంటూ నెగిటివ్ కామెంట్లు కూడా తెరపైకి వచ్చాయి.
తీవ్ర జ్వరం కారణంగానే విశాల్ అలా ఉన్నారని డాక్టర్లు హెల్త్ బులిటెన్ రెండుసార్లు రిలీజ్ చేసినా? ఇదంతా అవాస్తవం అంటూ చాలా మంది భావించారు. దీనిపై సోషల్ మీడియాలో చర్చ అంతే ఆసక్తికరంగా సాగింది. దీనికి తోడు విశాల్ కుటుంబ సభ్యులు కూడా ఎవరూ స్పందించలేదు. దీంతో ఇదంతా నిజమేనా? అన్న అభూత కల్పన మరింత ఎక్కువైంది. ఈ నేపథ్యంలో తాజాగా విశాల్ శనివారం 'మదగజ రాజ' ప్రీమియర్ రి విశాల్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా తన ఆరోగ్యంపై తొలిసారి స్పందించారు. 'మా నాన్న అంటే నాకెంతో ఇష్టం. ఆయన వల్లే నేనెంతో ధైర్యంగా ఉన్నాను. జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా తట్టుకుని నిలబడతా. ఇదంతా ఎందుకు చెబుతు న్నానంటే? కొంత మంది నేను సినిమాలకు రిటైర్మెంట్ ఇచ్చి వెళ్లిపోతానని అనుకుంటున్నారు. నాకు ఎలాంటి సమస్య లేదు. అంతా బాగానే ఉంది. ఇప్పుడు నా చేతులు వణకడం లేదు. మైక్ కూడా కరెక్ట్ గా పట్టుకోగల్గుతున్నా.
నా పై చూపించిన ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. నా చివరి శ్వాస వరకూ మీ అభిమానాన్ని మర్చిపోను. నేను కోలుకోవాలని మీరు పెట్టిన ప్రతీ మెసేజ్ కోలుకునేలా చేసాయి' అని తెలిపారు. దీంతో విశాల్ ఆరోగ్యంపై వచ్చిన వదంతులన్నీ తొలగిపోయాయి. కేవలం ఆయనకు తీవ్ర జ్వరం రావడంతోణే క్షీణించ శరీరమంతా అలా ఒణికిందని తెలుస్తోంది.