ఆ వివాదాస్పద కామెంట్లపై హీరో విశాల్ ఏమన్నాడంటే?
తాజాగా మిస్కిన్ వ్యాఖ్యల, క్షమాపణపై నటుడు విశాల్ స్పందించారు.
By: Tupaki Desk | 28 Jan 2025 5:36 AM GMTఇటీవలే కోలీవుడ్ డైరెక్టర్ మిస్కిన్ సంగీత దర్శకుడు ఇళయరాజా సంగీతం, పాటలు గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో ఆ వ్యాఖ్యల్ని తప్పుగా భావించొద్దని..అవి కేవలం తన మనసులో వాటిని మాత్రమే బయట పెడుతున్నట్లు మాట్లాడారు. తాను మందు తాగితే ఇళయ రాజా పాటలకు తనకు స్టప్ లా ఉంటాయని..కొత్తగా మరో స్టప్ అవసరం లేదన్నారు.
ఆయన పాటల వినడం కోసం మద్యం సేవించే వారి సంఖ్య కూడా పెరిగిందన్నారు. అయితే ఈ వ్యాఖ్యలకు మిస్కిన్ తర్వాత క్షమాపణలు కూడా తెలియజేసాడు. ఇలా మాట అనేయడం...తర్వాత క్షమాపణ చెప్పడం ఎలా ఉందంటే ముందు కోపంతో కొట్టేసి ఆ తర్వాత క్షమాపణ అడిగినట్లు ఉంది. దీంతో మిస్కిన్ పై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ సన్నివేశం `బాటిల్ రాధ` సినిమా ఈవెంట్లో చోటు చేసుకుంది.
తాజాగా మిస్కిన్ వ్యాఖ్యల, క్షమాపణపై నటుడు విశాల్ స్పందించారు. ఓ మీడియా సమావేశంలో `ఇది అలవాటుగా మారిందని... దాని గురించి మనం ఏం చెప్పగలం? కొంత మంది స్వభావం ఎప్పటికీ మార్చుకోలేరన్నారు. ఇళయ రాజా సంగీతం చాలా మందిని నిరాశ నుండి బయటకు తీసుకురావడానికి సహాయపడిందన్నారు. అలాగే మిస్కిన్ ఆయనను అగౌరవ పరచలేదని అన్నారు. ఇళయరాజా సంగీతం అందరి రక్తంలో ఉందన్నారు.
ఆయన గురించి అలాంటి మాటలు మాట్లాడే హక్కు ఎవరికీ లేదన్నారు. కొన్ని సున్నితమైన అంశాల గురించి మాట్లాడకపోవడమే మంచిందన్నారు. దీంతో విశాల్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. అంతకుముందు `బ్యాడ్ గర్ల్` టీజర్ లాంచ్ సందర్భంగా గేయ రచయిత తమరై, లెనిన్ భారతి, అరుల్‌దాస్, లక్ష్మీ రామకృష్ణన్, నిర్మాత తనులకు మిస్కిన్ క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని, వాటిని హాస్యభరితంగా మాత్రమే చూడాలని మిస్కిన్ కోరాడు.