విశాల్.. ఈ సినిమా పోతే ఇక అంతే!
ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన యాక్షన్ సినిమాలు భరణి, పూజ ప్రేక్షకులను విపరీతంగా అలరించాయి
By: Tupaki Desk | 25 April 2024 11:26 AMకోలీవుడ్ స్టార్ హీరో విశాల్ కు టాలీవుడ్ లో కూడా అనేక మంది ఫ్యాన్స్ ఉన్న విషయం తెలిసిందే. ఆయన నటించిన సినిమాలు తెలుగులో కూడా విడుదల అవుతుంటాయి. అలా తాజాగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమా రత్నం. మాస్ డైరెక్టర్ హరి, విశాల్ కాంబోలో తెరకెక్కిన హ్యాట్రిక్ చిత్రమిది. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన యాక్షన్ సినిమాలు భరణి, పూజ ప్రేక్షకులను విపరీతంగా అలరించాయి
ఇప్పుడు మరోసారి ఈ హిట్ కాంబోలో రత్నం మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో విశాల్ కు జోడీగా హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ యాక్ట్ చేస్తోంది. తెలుగు, తమిళంలో ఏప్రిల్ 26వ తేదీన గ్రాండ్ గా విడుదల అయ్యేందుకు సిద్ధమైందీ చిత్రం. ఇటీవల సెన్సార్ ఫార్మాలిటీస్ ను కూడా పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యుల నుంచి యూ/ఏ సర్టిఫికెట్ తో పాటు పాజిటివ్ రెస్పాన్స్ అందుకున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ కు మోస్తరు రెస్పాన్స్ వచ్చింది. కానీ సరైన బజ్ క్రియేట్ అవ్వలేదు. దీంతో వరుసగా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు విశాల్. చివరి నిమిషం వరకు ప్రమోట్ చేస్తూనే ఉంటానని ఇటీవల ఓ కార్యక్రమంలో తెలిపారు. కచ్చితంగా రత్నం మూవీ పైసా వసూలు సినిమా అవుతుందని జోస్యం చెప్పారు. బజ్ పెంచేందుకు ట్రై చేస్తున్నారు.
ఇప్పుడు ఈ చిత్రం ఎలాంటి రిజల్ట్ సాధిస్తుందోనని అంతా మాట్లాడుకుంటున్నారు. అయితే కోలీవుడ్ లో ఏదో ఒక రకంగా సక్సెస్ అవుతున్న విశాల్ నటించిన సినిమాలు.. తెలుగులో మాత్రం ఈ మధ్య ఇన్వెస్ట్మెంట్ కూడా రాబట్టడం లేదు. మార్క్ ఆంటోనీ, లాఠీ, ఎనిమి, యాక్షన్ సినిమాల విషయంలో అలానే జరిగింది. ఇక ఈసారి రత్నంతో హిట్ కొట్టకుంటే విశాల్ నెక్స్ట్ సినిమాను తెలుగు ఆడియన్స్ ఆదరించడం కష్టమే.
దీంతో రత్నంతో టాలీవుడ్ లో విశాల్ సరైన హిట్ అందుకోవాల్సి ఉంది. తెలుగులో క్లీన్ హిట్ అవ్వాలంటే రత్నం మూవీ రూ.4.50 కోట్ల షేర్ రాబట్టాలని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మిగతా సినిమాలతో రత్నం మూవీకి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి పోటీ లేదు. దీంతో ఈ సినిమాకు పాజిటివ్ మౌత్ టాక్ వస్తే చాలు. సూపర్ వసూళ్లు వస్తాయి. విశాల్ తో పాటు డైరెక్టర్ హరికి కూడా ఈ మూవీ హిట్ అవ్వడం చాలా ముఖ్యం. మరేం జరుగుతుందో చూడాలి.