ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన విశాల్!
కోలీవుడ్ హీరో విశాల్ తమిళనాడు డీఎంకే ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సినిమా ఇండస్ట్రీలో ప్రభుత్వ జోక్యం ఏంటని మండిపడ్డారు
By: Tupaki Desk | 22 July 2024 6:04 PM GMTకోలీవుడ్ హీరో విశాల్ తమిళనాడు డీఎంకే ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సినిమా ఇండస్ట్రీలో ప్రభుత్వ జోక్యం ఏంటని మండిపడ్డారు. గత ప్రభుత్వం పరిశ్రమలో జోక్యం చేసుకోలేదని, కానీ తాజా ప్రభుత్వం మాత్రం ఫింగరింగ్ చేస్తుందని ఆరోపించారు. ఆయన హీరోగా నటించిన `రత్నం` సినిమా విడుదల సమయంలో జరిగిన సంఘటన గుర్తు చేసారు. తమిళ పరిశ్రమలో రెడ్ జెయింట్ మూవీస్ ఆధిపత్యాన్ని ఎండగట్టే ప్రయత్నం చేసారు.
ఆ సంస్థ అధినేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ టార్గెట్ విమర్శలు చేసారు. `రత్నం` సినిమా రిలీజ్ ని ఆ సంస్థనే అడ్డుకుందని, వారికి అలాంటి అధికారం ఎక్కడ నుంచి వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేసారు. ` ఏడాది కాలంగా సినిమా ఇండస్ట్రీ కష్టాల్లో ఉంది. సినిమా కొనడానికి ఎవరూ ముందుకు రావడం ఒక కారణం. రాబోయే రోజుల్లో 10 పెద్ద సినిమాలు విడుదల వుతున్నాయి. దీంతో చిన్న సినిమాలు కొనేవారు లేకుండా పోయారు.
విడుదల చేసేవారు లేరు. దీనికి కారణం ప్రభుత్వమే. ప్రతీ విషయంలో రెడ్ జెయింట్ సంస్థ ఇన్వాల్వ్ అవుతుంది. కొనే వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. అన్ని తమ చేతుల్లోనే ఉండాలని అధిపత్యం ప్రదర్శిస్తుంది. ఇది సరైన విధానం కాదు. మంచి సినిమాల్ని ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. రాష్ట్రం ఎన్నో సమస్యల్లో ఉంది. ఇంకా తాగు నీరు లేని గ్రామాలెన్నో ఉన్నాయి.
స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా మంచి నీటి కోసం, కూటి కోసం ప్రజలు అలమటిస్తూనే ఉన్నారు. ఇంకా మరెన్నో సమస్యలున్నాయి. ప్రభుత్వం వాటిని గాలికొదిలేసి సినిమా ఇండస్ట్రీ ని టార్గెట్ చేసి కక్షపూరిత చర్యలకు పూనుకుంటుంది. మునుపెన్నడు ఏ ప్రభుత్వంలోనే ఇలాంటి చర్యలు చూడలేదు` అని అసహనం వ్యక్తం చేసారు.