Begin typing your search above and press return to search.

న‌టితో మేక‌ప్ వ్యాన్‌లో రెడ్ హ్యాండెడ్‌గా చిక్కాడు

పెళ్లి అయిన రెండు నెలల తర్వాత భ‌ర్త మోసం బ‌య‌ట‌ప‌డింది. అత‌డు రెడ్ హ్యాండెడ్ గా వేరొక మ‌గువ‌తో భార్య‌కు దొరికాడు.

By:  Tupaki Desk   |   19 July 2024 10:31 AM GMT
న‌టితో మేక‌ప్ వ్యాన్‌లో రెడ్ హ్యాండెడ్‌గా చిక్కాడు
X

పెళ్లి అయిన రెండు నెలల తర్వాత భ‌ర్త మోసం బ‌య‌ట‌ప‌డింది. అత‌డు రెడ్ హ్యాండెడ్ గా వేరొక మ‌గువ‌తో భార్య‌కు దొరికాడు. అది కూడా ఆన్ లొకేష‌న్ మేక‌ప్ వ్యాన్ లో భోగోతం బ‌య‌ట‌ప‌డ‌టంతో చివ‌ర‌కు భార్య విడాకుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకుంది. ఈ టాప్ సీక్రెట్ ని బ‌యట పెట్టింది ఎవ‌రో తెలుసా? సంవత్సరాలుగా అనేక ఉన్నత స్థాయి ప్రముఖుల వివాహాలకు స్టిల్/ వీడియోగ్రాఫ‌ర్ గా ఉన్న విశాల్ పంజాబీ. ప్ర‌ముఖుల పెళ్లిళ్లను షూట్ చేయడంలో అత‌డు పుప్ర‌సిద్ధుడు.

విశాల్ పంజాబీ ఒక ప్రముఖ స్టార్ క‌పుల్ తో తనకు ఎదురైన వివాదాస్పద అనుభవం గురించి మాట్లాడాడు. అతడు వారి కోసం నిర్మించాల్సిన వీడియో గురించి ఒప్పందం కుదుర్చుకోవాల‌ని వెళితే.. దానిని అంగీకరించడానికి వారు నిరాకరించారని, ఎందుకంటే భర్త - `పెద్ద బాలీవుడ్ నటుడు` .. వారి పెళ్లైన రెండు నెలల తర్వాత తన భార్యను మోసం చేస్తూ పట్టుబడ్డాడని గుర్తు చేసుకున్నాడు.

డీజే సిమ్జ్ యూట్యూబ్ ఛానెల్‌లో కనిపించిన విశాల్ విడాకులతో ముగిసిన వివాహాన్ని ఎప్పుడైనా చిత్రీకరించారా? అని విశాల్‌ను ప్రశ్నించగా అతడు ఇలా సమాధానమిచ్చాడు. ``అది ఒక సెలబ్రిటీతో కుదిరింది. వారి పెళ్లైన రెండు నెలల తర్వాత అతడు ఆమెను మోసం చేస్తున్నాడు. అతడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. ఒక‌ బాలీవుడ్ నటితో మేక‌ప్ వ్యాన్ లో కులుకుతూ దొరికిపోయాడు. అతని భార్య బాలీవుడ్ మూవీ సెట్‌లో నడుస్తూ , అతడిని నగ్నంగా పట్టుకుని ద‌బాయించింది. ``నాకు నీ పెళ్లి వ‌ద్దు.. సినిమా వద్దు`` అని చెప్పింది.

తర్వాత నేను వరుడికి కాల్ చేసాను. అతడు ఫోన్ ఎత్త‌లేదు. నేను వధువుకు కాల్ చేసాను. నాతో మాట్లాడకు, నాకు పెళ్లి సినిమా వ‌ద్దే వద్దు! అని అంది. ఈ పరిస్థితిలో నేను అతడి మేనేజర్ కి కాల్ చేసాను. అత‌డు ఇలా అన్నాడు. ``అయ్యా అది జరగదు.. మాకు సినిమా వద్దు... నేను దానిని నెట్‌ఫ్లిక్స్‌కి అమ్మాలా?`` అని అడిగాడు. విశాల్ తన సేవలకు కూడా పూర్తిగా చెల్లించలేదని, ఈ అనుభవం తన వ్యాపారంలో కొన్ని ఫార్ములాస్‌ని మార్చేలా చేసింద‌ని తెలిపాడు. అప్పట్లో నేను మీకు సినిమా ఇవ్వడానికి ముందు 50 శాతం.. తర్వాత 50 శాతం అని ఒక ఒప్పందం కుదుర్చుకున్నాను. ఈ సంఘటన తర్వాత నేను పూర్తిగా మారాను. అది పెళ్లి అయినా ఇంకేదైనా కానీ వంద‌శాతం వ‌సూలు చేసేస్తున్నాను`` అని తెలిపాడు.

తన వద్ద ఇంకా ఫుటేజీ ఉందని, అయితే తర్వాత పెండింగ్‌లో ఉన్న చెల్లింపుల కోసం వారిని వెంబడించలేదని చెప్పాడు. సినిమాలో పెళ్లికొడుకు `ఐ లవ్ యూ బేబీ` అంటూ ఏడుస్తున్నాడు.. అవి ఫేక్ మొసలి కన్నీరు.. అతనో పెద్ద బాలీవుడ్ నటుడు. పేర్లు చెప్పలేను కానీ... నా దగ్గర ఉన్నది విలువైన‌ది. ఆ ఫుటేజ్ మిలియన్ల విలువైనది.. నేను దానిని విక్రయించి డబ్బు సంపాదించగలను అని కూడా చెప్పాడు.

అనుష్క శర్మ-విరాట్ కోహ్లీ, దీపికా పదుకొనే-రణ్‌వీర్ సింగ్ , కియారా అద్వానీ-సిద్ధార్థ్ మల్హోత్రా వంటి ప్రముఖ జంటల కోసం విశాల్ పెళ్లి వేడుక‌ల్ని డాక్యుమెంట్ చేసాడు. గతంలో అతడు షారూఖ్ ఖాన్ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో ఒక దశాబ్దం పాటు పనిచేశాడు.