Begin typing your search above and press return to search.

క‌ష్టాల్లో ఉన్న నిర్మాత‌ల‌ సంక్షేమం కోస‌మే ఖ‌ర్చు చేసాం: విశాల్

విశాల్‌తో పనిచేసే నిర్మాతలు, సాంకేతిక నిపుణులు అసోసియేషన్‌ను సంప్రదించాలని కౌన్సిల్ అభ్యర్థించింది.

By:  Tupaki Desk   |   27 July 2024 9:56 AM GMT
క‌ష్టాల్లో ఉన్న నిర్మాత‌ల‌ సంక్షేమం కోస‌మే ఖ‌ర్చు చేసాం: విశాల్
X

స్టార్ హీరో విశాల్ తెలుగు వాడే అయినా కానీ కోలీవుడ్ లో చ‌క్రం తిప్పుతూ నిరంత‌రం వార్త‌ల్లో నిలుస్తుంటాడు. త‌మిళ సినీప‌రిశ్ర‌మ రాజ‌కీయాల్లో అతడు ఒక భాగం. అక్క‌డ న‌డిగ‌ర సంఘం, నిర్మాత‌ల మండ‌లి (టిఎఫ్‌పిసి)లో కీల‌క బాధ్య‌త‌ల్ని నిర్వ‌ర్తించాడు గ‌తంలో. విశాల్ డేరింగ్ డెసిష‌న్స్, చొర‌వ, తెగువ గురించి కోలీవుడ్ మీడియా చాలా క‌థనాలు ప్ర‌చురించింది. ఇదిలా ఉంటే త‌మిళ నిర్మాత‌ల మండ‌లి టిఎఫ్‌పిసి ప్ర‌స్తుత అధ్య‌క్షుడైన శ్రీ తేనాండాళ్ ఫిలిమ్స్ ముర‌ళీ రామ‌స్వామి అండ్ టీమ్ నుంచి విశాల్ పై తీవ్ర ఆరోప‌ణ‌లు వచ్చాయి. 2017లో కౌన్సిల్ అధ్య‌క్షుడిగా ఉన్న స‌మ‌యంలో విశాల్ నిధులను దుర్వినియోగం చేశాడ‌న్న ఆరోపణలు వ‌చ్చాయి. ఇప్పుడు విశాల్‌పై విచారణకు కౌన్సిల్ ఆదేశించింది. విశాల్‌తో పనిచేసే నిర్మాతలు, సాంకేతిక నిపుణులు అసోసియేషన్‌ను సంప్రదించాలని కౌన్సిల్ అభ్యర్థించింది.

త‌మిళ నిర్మాత‌ల మండ‌లి TFPC ప్ర‌క‌ట‌న సారాంశం ఇలా ఉంది. ``2017-2019 సీజ‌న్‌కి తమిళ నిర్మాత‌ల సంఘం అధ్య‌క్షుడిగా పనిచేసిన శ్రీ విశాల్‌పై వచ్చిన ఆరోపణల ఆధారంగా తమిళనాడు ప్రభుత్వం 2019లో ప్రత్యేక అధికారిని నియమించింది. ఖాతాలను విశ్లేషించిన తర్వాత సంఘం నిధులు దుర్వినియోగం అయ్యాయని ఆడిటింగ్ నివేదిక వెల్లడించింది. దీని ఫలితంగా కౌన్సిల్ బ్యాంక్ డిపాజిట్ల నుండి రూ.7.5 కోట్లు ... 2017-2019 ఆదాయం మరియు వ్యయం నుండి రూ.5 కోట్లు సహా మొత్తంగా సుమారు రూ.12 కోట్ల నష్టం వాటిల్లింది. దుర్వినియోగమైన నిధులను తిరిగి ఇవ్వాలని శ్రీ విశాల్‌కు పలుమార్లు సందేశాలు పంపినా కానీ అతడి నుంచి ఎలాంటి స్పందన రాలేదు`` అని నోట్‌లో పేర్కొన్నారు.

అయితే దీనికి విశాల్ ప్ర‌తిస్పందిస్తూ చేసిన వ్యాఖ్య‌లు కూడా సంచ‌ల‌నం అయ్యాయి. త‌న‌ను ఎవ‌రైనా ఆపాల‌ని చూసినా త‌న ప‌నిని ఆప‌న‌ని, య‌థావిధిగా సినిమాలు నిర్మిస్తాన‌ని విశాల్ త‌న ప్ర‌క‌ట‌న‌లో ప్ర‌తి స‌వాల్ విసిరాడు. సినిమాలు తీయ‌ని వాళ్లే ఇలాంటి ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని కూడా అన్నాడు. ``ఇది (నిధుల ఖర్చు) మీ టీమ్‌లోని వ్యక్తి `మిస్టర్ కతిరేసన్`తో కూడిన సమిష్టి నిర్ణయం అని మీకు తెలియదా? విద్య, వైద్య బీమా అందించడంతోపాటు నిర్మాతల మండలిలోని వృద్ధులు కష్టాల్లో ఉన్న సభ్యుల సంక్షేమ పనుల కోసం నిధులు ఉపయోగించాయి. కౌన్సిల్ సభ్యులు, వారి కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చే పనులు చేసాం. పండుగల సమయంలో ప్రాథమిక సంక్షేమం కోసం ఖ‌ర్చు చేసాం`` అని విశాల్ వివ‌ర‌ణ ఇచ్చారు. అంతేకాదు.. మీ ఉద్యోగాలను సరిగ్గా చేయండి.. పరిశ్రమ కోసం చేయడానికి చాలా ఉంది అని కూడా సూచించారు. విశాల్ ఎప్పుడూ సినిమాలు చేస్తూనే ఉంటాడు. సినిమాలు నిర్మించని.. ఎప్పటికీ నిర్మించని నిర్మాతలే నన్ను ఆపడానికి ప్రయత్నిస్తున్నారు! అని విశాల్ ప్ర‌తిదాడి చేసారు.