Begin typing your search above and press return to search.

కల్కిపై పోస్ట్.. విశ్వక్ ఫుల్ ఫైర్!

అయితే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటారు విశ్వక్ సేన్. వివిధ విషయాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తుంటారు.

By:  Tupaki Desk   |   19 Jun 2024 4:07 AM GMT
కల్కిపై పోస్ట్.. విశ్వక్ ఫుల్ ఫైర్!
X

టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కు ఉన్న క్రేజే వేరు. తక్కువ టైమ్ లోనే సూపర్ పాపులారిటీ దక్కించుకున్నారు ఈ యంగ్ హీరో. వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. విభిన్న జోనర్లలో మూవీలు చేస్తూ దూసుకుపోతున్నారు. హీరోగానే కాకుండా.. డైరెక్టర్, నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. తెలుగులో మల్టీ టాలెంటెడ్ యంగ్ హీరోగా రానిస్తున్నారు. ఇటీవల గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

అయితే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటారు విశ్వక్ సేన్. వివిధ విషయాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తుంటారు. తన సినిమాల విషయంలో తప్పుడు ప్రచారం చేస్తే పోస్టుల ద్వారా ఇచ్చిపడేస్తారు. గామి చిత్రం టైమ్ లో బుక్ మై షో యాప్ లో రేటింగ్ వివాదంపై తీవ్రస్థాయిలో వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల తన అప్ కమింగ్ మూవీ మెకానిక్ రాకీ థియేట్రికల్ రైట్స్ విషయంలో జరుగుతున్న ప్రచారంపై కూడా గట్టి కౌంటర్ ఇచ్చారు విశ్వక్.

తాజాగా రిలీజ్ అవ్వకముందే.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి 2898 ఏడీ మూవీపై జరుగుతున్న నెగిటివ్ ప్రచారాన్ని విశ్వక్ సేన్ ఎండగట్టారు. అలాంటి వారు పైరసీ కన్నా ప్రమాదంటూ ఫైర్ అయ్యారు. కల్కిపై ఓ నెటిజన్.. హాలీవుడ్ నుంచి రిఫరెన్సులు తీసుకుని చేశారని వీడియో పోస్ట్ చేశాడు. సినిమాపై కూడా నెగిటివ్ కామెంట్స్ చేశాడు. దీంతో విశ్వక్.. తన ఇన్ స్టా స్టోరీలో ఆ వీడియో షేర్ చేసి గట్టి కౌంటర్ ఇచ్చారు. 10 నిమిషాల షార్ట్ ఫిల్మ్ తీయాలని ఛాలెంజ్ విసిరారు.

"సినిమాలు రిలీజ్ కూడా అవ్వకముందే చెంబు పట్టుకుని బయలుదేరుతున్నారు. యూట్యూబ్ లో మీ ఇన్ కమ్ కోసం కొన్ని వేల ఫ్యామిలీస్ రన్ అవుతున్న ఇండస్ట్రీతో మజాక్ లు అయిపోయినాయ్ మీకు.. వీడు ఒక పది నిమిషాల షార్ట్ ఫిల్మ్ తీస్తే చూద్దాం మనం. లేదంటే అడ్రస్ తప్పిపోయిన వాళ్ళు అనుకుని ఇగ్నోర్ చేద్దాం. 10 నిమిషాల షార్ట్ ఫిల్మ్ తీయ్. ఇలాంటి ఒపీనియన్స్ బయట బజార్ లో పెట్టి తిరిగే వాళ్ళు అందరూ" అంటూ ఫైర్ అయ్యారు విశ్వక్ సేన్.

"చుట్టూ ఉన్న కొంతమంది ప్రజలు.. పైరసీ కన్నా డేంజర్.. సినిమా సెట్స్ పై ఆధారపడి ఎంతో మంది ఉపాధి పొందుతున్న విషయాన్ని ఇప్పటికైనా అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. నువ్వు తీయ్ ఒక 10 నిమిషాల షార్ట్ ఫిల్మ్. ఎప్పుడు నీకు.. నీ ఒపీనియన్ కు కొంచెం రెస్పెక్ట్ ఉంటాది" అని ఇచ్చిపడేశారు. ప్రస్తుతం విశ్వక్ సేన్ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. మరోవైపు, జూన్ 27వ తేదీన కల్కి రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.