నాని-బన్నీ మధ్యలో సినిమాటోగ్రాఫర్ ట్విస్ట్
నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో 'ది ప్యారడైజ్' తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 3 March 2025 5:00 PM ISTనేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో 'ది ప్యారడైజ్' తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సినిమా ఆన్ సెట్స్ లో ఉంది. ఇప్పటికే టీజర్ తో అంచనాలు ఒక్కసారిగా పెరిగి పోయాయి. నాని మాస్ ఎలివేషన్ తో భారీ యాక్షన్ చిత్రంగా సంచలనమవుతుంది. ఈ సినిమాకి జి.కె విష్ణు సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తవ్వడానికి ఇంకా చాలా సమయం పడుతుంది.
షూటింగ్ ఇంకా ఆరంభ దశలోనే ఉంది. ఎలా లేదన్నా? చిత్రీకరణకే నెలలు సమయం పడుతుంది. మరి ఈ సినిమాకు నెలలు సమయం పడితే? ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- అట్లీ సినిమా చిత్రీకరణ ప్రారంభమయ్యేదెప్పుడు? నాని సినిమాకి- బన్నీ సినిమాకి సంబంధం ఏంటి? అనుకుంటున్నారా? అయితే అసలు విషయంలోకి వెళ్లాల్సిందే. నాని చిత్రంతో పాటు, బన్నీసినిమాకు సినిమాటోగ్రాఫర్ గా కమిట్ అయింది ఒక్కరే. అతనే విష్ణు.
ప్రస్తుతానికి బన్నీ సినిమా సెట్స్ కి వెళ్లలేదు కాబట్టి విష్ణు ప్యారడైజ్ షూట్ లో బిజీగా ఉన్నారు. ఒకవేళ షూట్ మొదలైతే పరిస్థితి ఏంటి? అన్నది ఆసక్తికరంగా మారింది. రెండు సినిమాలకు ఏక కాలంలో సినిమాటోగ్రాఫర్ గా పనిచేయడం అన్నది అసాధ్యం. అంటే బన్నీ సినిమా షూటింగ్ ఇప్పట్లో పట్టాలెక్కదు కాబట్టే విష్ణు కమిట్ అయ్యాడా? లేక మధ్యలో ఏదైనా ప్లానింగ్ మారిందా? అన్నది ఆసక్తికరంగా మారింది.
బన్నీ సినిమా విషయంలో ఇంకా పూర్తి క్లారిటీ లేని సంగతి తెలిసిందే. మార్చి నెలఖరుకల్లా ముందుగా అట్లీతో మొదలవుతుందా? త్రివిక్రమ్ తో మొదలవుతుందా? అన్నది తేలుతుంది. అటుపై సినిమా టోగ్రాఫర్ విషయంలో కూడా ఓక్లారిటీ వస్తుంది. జి.కె విష్ణు అట్లీకి అస్థాన సినిమాటోగ్రాఫర్. అట్లీ గత మూడు చిత్రాలకు విష్ణునే కెమెరా మ్యాన్. మెర్సల్, బిగిల్, జవాన్ సినిమాలకు విష్ణు పనిచేసాడు. అంతకు ముందు చిత్రాలకు విష్ణు స్థానంలో జార్జ్ విలియమ్స్ పనిచేసాడు.