Begin typing your search above and press return to search.

'మా' సొంత బిల్డింగ్ పై అద్భుత‌మైన ప్ర‌క‌ట‌న‌!

`మా` (మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ) కి సొంత బిల్డింగ్ ఏర్పాటు చేస్తామ‌నే హామీతో గ‌త ఎన్నిక‌ల్లో మంచు విష్ణు ప్యానెల్ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే

By:  Tupaki Desk   |   30 Sep 2024 12:30 PM GMT
మా సొంత బిల్డింగ్ పై అద్భుత‌మైన ప్ర‌క‌ట‌న‌!
X

`మా` (మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ) కి సొంత బిల్డింగ్ ఏర్పాటు చేస్తామ‌నే హామీతో గ‌త ఎన్నిక‌ల్లో మంచు విష్ణు ప్యానెల్ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. అప్ప‌టి నుంచి వివిధ కార్య‌క్ర‌మాలు చేసు కుంటూ వ‌చ్చారు. అయితే `మా` సొంత బిల్డింగ్ మాత్రం ఇంత‌వ‌ర‌కూ ఏర్పాటు కాలేదు. సొంత బిల్డింగ్ ఏర్పాటు అన్న‌ది స‌భ్యుల‌కు ఎప్ప‌టి నుంచో ఉన్న ఓ క‌ల‌.

అంత పెద్ద అసోసియేష‌న్ ఉండి సొంత బిల్డింగ్ లేద‌నే బాధ అంద‌రిలోనూ ఉంది. దీంతో మంచు విష్ణు బాధ్య‌త‌ను తాను తీసుకున్నాడు. తాజాగా ఓహెల్త్ క్యాంప్ పాల్గొన్న విష్ణు బిల్డింగ్ గురించి కీల‌క ప్ర‌క‌ట‌న చేసారు. `మేం ఏమ‌నుకుని వ‌చ్చామో అన్ని ప‌నులు పూర్త చేసాం. మా బిల్డింగ్ ఒక్క‌టే బాకీ ఉంది. ఈ అంశంపై కూడా రాబోయే రెండు నెల‌ల్లో అద్భుత‌మైన ప్ర‌క‌ట‌న చేయ‌బోతున్నాం` అని అన్నారు.

దీంతో రెండు నెల్లో విష్ణు ఏం చెప్ప‌బోతున్నాడు? అన్న‌ది స‌భ్యుల్లో స‌హా ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే బిల్డింగ్ కి సంబంధించి గ‌తంలో కొన్ని ర‌కాల ప్ర‌చారాలు సాగాయి. విష్ణు ఇప్పుడున్న ఛాంబ‌ర్ బిల్డింగ్ కి దూరంగా మ‌రో సొంత బిల్డింగ్ ఏర్పాటు చేస్తున్నార‌ని, కానీ అది సభ్యుల‌కు క‌న్వినెంట్ గా ఉండ‌ద‌ని, అంత దూరం వెళ్ల‌డానికి ఎవ‌రూ ఆస‌క్తి చూపించ‌క‌పోవ‌డంతో ఆ ఆలోచ‌న విర‌మించికున్న‌ట్లు గ‌తంలో ప్ర‌చారం సాగింది.

ఆ త‌ర్వాత మ‌ళ్లీ సొంత బిల్డింగ్ అంశం తెర‌పైకి రాలేదు. తాజాగా బిల్డింగ్ అంశంపై విష్ణు స్పందించ‌డంతో అంద‌రి మ‌ధ్య చ‌ర్చ‌కు దారి తీస్తుంది. `మా` లో మొత్తం 900 మంది స‌భ్యులున్నారు. విష్ణు అధ్య‌క్షుడు కాగా, ఉపాధ్య‌క్షుడిగా మాదాల ర‌వి, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ర‌ఘుబాబు కొన‌సాగుతున్నారు.