Begin typing your search above and press return to search.

కన్నప్ప ప్రభాస్.. అంచనాలకు మించి..!

ఈ సందర్భంగా సినిమా గురించి కొన్ని ప్రత్యేకమైన విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు.

By:  Tupaki Desk   |   24 March 2025 6:30 PM IST
Vishnu praises prabhas in kannappa
X

మంచు విష్ణు లీడ్ రోల్ లో అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ లో మంచు మోహన్ బాబు నిర్మించిన సినిమా కన్నప్ప. ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో టైటిల్ రోల్ ని మంచు విష్ణు చేయగా సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, మోహన్ బాబు లాంటి స్టార్స్ నటించారు. ఈ సినిమాను ఏప్రిల్ 25న రిలీజ్ లాక్ చేశారు. ఇక కన్నప్ప ప్రమోషన్స్ లో భాగంగా రెడ్ లారీ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొన్నారు కన్నప్ప టీం. ఈ సందర్భంగా సినిమా గురించి కొన్ని ప్రత్యేకమైన విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు.


కన్నప్ప మీద సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్న మంచు విష్ణు ప్రతి ప్రమోషనల్ స్పీచ్ లో అంచనాలు పెంచేస్తున్నారు. లేటెస్ట్ గా తాను ఆంజనేయ స్వామి భక్తుడిని కానీ కన్నప్ప చేశాక శివ భక్తుడిగా మారానని అన్నారు. కన్నప్ప సినిమా అందరినీ ఆకట్టుకుంటుందని అన్నారు. సినిమాలో ప్రభాస్ పాత్రపై మీరు ఎంత ఊహించుకున్నా అంతకుమించి అనేలా ఆ పాత్ర ఉంటుందని అన్నారు మంచు విష్ణు. కన్నప్ప ప్రయాణంలో ఎన్నో విషయాలను నేర్చుకున్నానని అన్నారు.


ఇదే ఈవెంట్ లో డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ కూడా సినిమాపై తన కాన్ఫిడెన్స్ ని వ్యక్తపరిచారు. 2015 లోనే విష్ణు ఈ కథను అనుకున్నారు. 2016 శ్రీకాళహస్తిలో శివ దర్శనం తర్వాత ఆ శివుడే తనని ఈ ప్రాజెక్ట్ లోకి పంపించాడని అన్నారు. మహాభరతం సీరియల్ అందరు ప్రేమించారు. కన్నప్పని కూడా అదే స్థాయిలో ప్రేమిస్తారని అన్నారు ముఖేష్ కుమార్ సింగ్. ఈ సినిమాతో తాను ఎంతోమంది స్టార్స్ తో పనిచేసే అవకాశం దక్కిందని అన్నారు.


ఇక కన్నప్ప లాంటి గొప్ప సినిమాలో మంచి పాత్ర చేయడం నా అదృష్టమని అన్నారు సీనియర్ యాక్టర్ బ్రహ్మాజీ. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్ చెప్పారు. మా అందరి కెరీర్ లో కన్నప్ప ముందు కన్నప్ప తర్వాత అన్నట్టుగా ఉంటుందని అన్నారు బ్రహ్మాజీ. సినిమా నా బర్త్ డే సందర్భంగా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాలో మంచు విష్ణు నటన చూసి అంతా ఫిదా అవుతారని సినిమా మైండ్ బ్లోయింగ్ అనేలా ఉంటుందని అన్నారు.


కన్నప్ప లాంటి సినిమాలో నటించే అవకాశం రావడం అదృష్టమని అన్నారు రఘుబాబు. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. విష్ణు ఈ సినిమాతో మరోస్థాయికి వెళ్తారని అన్నారు. సినిమాలో అక్షయ్ కుమార్ లార్డ్ శివగా నటించగా ప్రభాస్ రుద్ర పాత్రలో కనిపించనున్నారు. ఈమధ్యనే వచ్చిన కన్నప్ప రెండో టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది.