కోట్లు ఇచ్చినా బిగ్ బాస్ లోకి వెళ్ళను.. కట్ చేస్తే..
యాంకర్‌గా, నటిగా మంచి గుర్తింపు పొందిన విష్ణు ప్రియ భీమినేని, రీసెంట్‌గా బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 రియాలిటీ షోలోకి ఎంట్రీ ఇచ్చారు.
By: Tupaki Desk | 2 Sep 2024 12:10 PM GMTయాంకర్‌గా, నటిగా మంచి గుర్తింపు పొందిన విష్ణు ప్రియ భీమినేని, రీసెంట్‌గా బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 రియాలిటీ షోలోకి ఎంట్రీ ఇచ్చారు. స్టేజ్‌పై డ్యాన్సులతో ఆకట్టుకున్న ఆమెపై అనూహ్యంగా ఓ పాత వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆమె గతంలో బిగ్‌బాస్ షోపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
విషయం ఏమిటంటే, గతంలో ఆమె బిగ్‌బాస్ షో గురించి మాట్లాడుతూ, "ఎన్ని కోట్లు ఇచ్చినా నేను బిగ్‌బాస్‌కి వెళ్లను. ప్రపంచం అందంగా ఉండగా, హౌస్‌లో ఉండడం ఎందుకు? నేను ఎప్పుడూ బిగ్‌బాస్ చూడలేదు, ఎంకరేజ్ కూడా చేయను. కొన్ని కోట్లు ఇచ్చినా కూడా నేను వెళ్ళాలని అనుకోవడం లెదు." అని అన్నారు. ఆమె ఈ మాటలు చెప్పినప్పటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
కొంత మంది నెటిజన్లు ఈ వీడియోను షేర్ చేస్తూ విష్ణు ప్రియను ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ నేను హౌస్ లోకి వెళితే అడగవచ్చు అని కూడా ఆమె కామెంట్ చేయడం అందరికి ఆశ్చర్యం కలిగిస్తోంది. ఏదేమైనా ఈ నేపథ్యంలో, బిగ్‌బాస్ షోలో ఆమె ఎంట్రీ ఇవ్వడం ఇన్టరెస్టింగ్‌గా మారింది.
కొందరు నెటిజన్లు ఆ వీడియోను షేర్ చేస్తూ, ఆమె గత వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ కామెంట్లు చేస్తున్నారు. అయితే విష్ణు ప్రియ సన్నిహితులు మాత్రం ఈ వీడియో 2019లో తీసినదని, ఆ సమయంలో ఆమె కుటుంబ పరిస్థితులు కష్టంగా ఉండటం వల్ల అలా స్పందించిందని వివరణ ఇచ్చారు. అప్పట్లో ఆమె తల్లి ఆరోగ్యం క్షీణించిందని, ఇప్పుడు బిగ్‌బాస్‌లోకి వెళ్లడంలో ఆమెకు ఎమోషనల్ కారణాలు ఉన్నాయని అన్నారు.
ఇప్పటికీ కొందరు ఆమె అభిమానులు మాత్రం బిగ్‌బాస్ షోలో విష్ణు ప్రియను మద్దతు ఇస్తూ, "అక్కడ ఉన్నప్పుడు ఆమెను చూసేందుకే షో చూడాలి" అని కామెంట్లు చేస్తున్నారు. ఇక షోలోకి వచ్చినప్పటి నుంచి ఆమెకి మంచి రెస్పాన్స్ వస్తుండటంతో, ఆమె గేమ్‌లో ఎలా రాణిస్తుందో చూడాలని చాలా మంది ఆసక్తిగా ఉన్నారు.
బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్ గ్రాండ్ స్టార్ట్ అయ్యింది అయింది. మొత్తం 14 మంది కంటెస్టెంట్లు.. ఏడు జంటలుగా హౌస్‍లోకి ఎంట్రీ ఇచ్చారు. సీజన్‍లో 12వ కంటెస్టెంట్‍గా హౌస్‍లోకి వెళ్లిన యాంకర్ విష్ణుప్రియ తప్పకుండా చివరి వరకు ఉండి గెలుస్తాను అని ధీమా వ్యక్తం చేసింది. మరి ఆమె ఎన్ని వారాలు కొనసాగుతుందో చూడాలి.